త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana DGP | ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులో ప‌డొద్దు.. అప్పుల‌పాలై ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్దు

Telangana DGP | ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసై అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న పోలీసు సిబ్బంది ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సెప్టెంబ‌ర్ 10న ప్ర‌పంచ ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ దినోత్స‌వం నేప‌థ్యంలో పోలీసు సిబ్బందిని ఉద్దేశించి ఆత్మ‌హ‌త్య‌లు వ‌ద్దంటూ డీజీపీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

S

Telangana | Published On Sep 10, 2026, 9.46 pm IST

Telangana DGP | ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులో ప‌డొద్దు.. అప్పుల‌పాలై ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్దు
Advertisement

కుటుంబ స‌భ్యుల‌తో ఆర్థిక విష‌యాలు పంచుకోండి
స‌మ‌స్య‌లుంటే అధికారుల‌ను సంప్ర‌దించండి
సెప్టెంబ‌ర్ 10న ప్ర‌పంచ ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా
పోలీసు సిబ్బందికి డీజీపీ సీవీ ఆనంద్ సందేశం

Telangana DGP | త్రినేత్ర‌.న్యూస్ : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసై అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న పోలీసు సిబ్బంది ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సెప్టెంబ‌ర్ 10న ప్ర‌పంచ ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ దినోత్స‌వం నేప‌థ్యంలో పోలీసు సిబ్బందిని ఉద్దేశించి ఆత్మ‌హ‌త్య‌లు వ‌ద్దంటూ డీజీపీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. గత నాలుగు నెలల్లో తెలంగాణ పోలీసు శాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు తనను కలచివేశాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. యువ, మధ్య వయస్కులైన కానిస్టేబుళ్లు ఇటువంటి ఘటనలకు పాల్పడటం మరింత బాధాకరమన్నారు.

ఈ ఘటనలపై జరిపిన విచారణలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మూలంగా అప్పులపాలవడమే ప్రధాన కారణంగా తేలిందని డీజీపీ పేర్కొన్నారు. కొందరు భూములు అమ్ముకోగా.. మరికొందరు స్నేహితులు, సహోద్యోగుల వద్ద అప్పులు చేశారని తెలిపారు. ఇంకొందరు అధిక వడ్డీకి డబ్బులు తీసుకున్నారని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి కారణంగా ఆత్మహత్యే పరిష్కారమని భావించడం విషాదకరమన్నారు.

వ్యసనాలు వద్దు.. కుటుంబమే ముద్దు

తమ వద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో కొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని డీజీపీ తెలిపారు. ముఖ్యంగా తమ ఆర్థిక పరిస్థితి, అప్పుల వివరాలను జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యులకు కూడా చెప్పకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే వాటిని దాచిపెట్టకుండా కుటుంబ సభ్యులతో పంచుకోవాలని సూచించారు. పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై శాఖ తరఫున ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని డీజీపీ తెలిపారు. బెట్టింగ్‌కు దూరంగా ఉండటంతోపాటు మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు బానిసలు కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు ఉన్నతాధికారులను సంప్రదించి పరిష్కారం పొందాలని చెప్పారు.

93 వేల మంది సిబ్బందికి విజ్ఞప్తి

ఆత్మహత్యలు వద్దు అంటూ.. తెలంగాణ పోలీసు శాఖలోని 93,000 మంది సిబ్బందికి డీజీపీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం, డ్రగ్స్‌, గంజాయి తదితర సామాజిక దురలవాట్లకు కూడా దూరంగా ఉండాలని కోరారు.

మీపై పూర్తిగా ఆధారపడి ఉన్న మీ కుటుంబాన్ని, మీ పిల్లలకు, మీ తల్లిదండ్రులకు మీ ఆత్మహత్యతో బాధను మిగిల్చవద్దన్నారు. మీరు లేకపోతే మీ కుటుంబం బాగోగులను ఎవరు చూస్తారు.. దయచేసి ఆలోచించండి అని డీజీపీ సి.వి. ఆనంద్‌ పోలీసు సిబ్బందికి హత్య ఆత్మహత్యలు చేసుకోవద్దు ధైర్యంగా జీవించాలి... అంటూ సిబ్బందికి పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement