KTR | అక్కల పట్ల పోలీసుల తీరు దారుణం.. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్
KTR | బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టంగా ఆదేశించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో డిబేట్, డిస్కస్, డిసెంట్ ఉండాలని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేటీఆర్ మాట్లాడారు.
KTR | బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టంగా ఆదేశించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో డిబేట్, డిస్కస్, డిసెంట్ ఉండాలని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేటీఆర్ మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. మిమ్మల్ని ఎన్ని రకాలు దూషించినా, టెప్ట్ చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండని కేసీఆర్ స్పష్టంగా శాసనసభ్యులు, మండలి సభ్యులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజాస్వామ్యం అంటేనే డిబేట్, డిస్కస్, డిసెంట్. ప్రజాస్వామ్యంలో చట్టసభల్లో శాసనసభ్యులు, మండలి చేయాల్సింది ఏంటీ? డిబేట్ చేయాలి. డిస్కస్ చేయాలి. ఒకవేళ ప్రజల ఆకాంక్షలు నెరవేరని పరిస్థితి ఉంటే నిరసన తెలపాలి.
పార్లమెంట్‌లో పత్రిపక్ష నేత రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో.. ఆయన ఏ రకంగా అయితే తన టీషర్టులపైనే ప్రధానమంత్రి బొమ్మ వేసుకొని స్లోగన్ రాసుకొని వెళ్లారు. అదే పద్ధతుల్లో మేం కూడా పార్లమెంటరీ భాషలోనే టీషర్టులపై స్లోగన్‌లు రాశాం. అన్‌పార్లమెంటరీ ఏముందో.. ముఖ్యమంత్రిని ఏమీ అనలేదు. సీఎం అన్నట్లుగా నికృష్టమైన భాషలో మాట్లాడలేదు. వందరోజులన్నారు.. వెయ్యిరోజుల మీ నిష్ఫల పాలన ఏంటీ? ఎందుకు హామీలు అమలు చేయలేదంటూ ప్రశ్నిస్తూ శాసనసభలోకి అడుగుపెట్టేందుకు ముందుకు వెళ్లాం.
పోలీసుల వ్యవహారశైలిపై ఆగ్రహం..
కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అక్కలు ముగ్గురు శాసనసభ్యులు. సీనియర్ నేతలు. గతంలో మంత్రులుగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా కోవ లక్ష్మి పని చేశారు. సహాయమంత్రి స్థాయిలో పని చేశారు. అపారమైన అనుభవం, అపారమైన సామాజిక స్పృహ, రాజకీయంలో ఎత్తుపల్లాలు, జీవితంలో ఎత్తుపల్లాలు ఎన్నో చూసిన అనుభన్ఞులు. సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి రాజకీయ కెరీర్ చూస్తే ఎవరైనా సరే వారిని అజాతశత్రువులుగా గుర్తిస్తరు. చాలా సౌమ్యంగా మాట్లాడే మృధుస్వభావులు. అలాంటి ఇద్దరి మా ఆడబిడ్డలను ఈ ముఖ్యమంత్రి, ఆయన పోలీసు బలగం ఎంత దుర్మార్గంగా, ఎంత కిరాతకంగా వ్యవహారం చేసిందో మొత్తం రాష్ట్రం, దేశం చూసింది.
రాహుల్ గాంధీ పెద్ద మాటలు మాట్లాడుతున్నడు
రాహుల్ గాంధీ మహిళల గౌరవం, స్వాతంత్య్రం, సాధికారత గురించి మాట్లాడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఏమో మహిళల గౌరవాన్ని, స్వాతంత్య్రాన్ని, సాధికారతను పెంచే దిశగా స్మాష్ ది ప్యాట్రియార్కి అని పెద్దపెద్ద మాటలు చెబుతున్నరు. అయ్యా రాహుల్ గాంధీ నువ్వు రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందే అక్కలు మంత్రులు. రాజకీయాల్లో మొట్టమొదటిసారి ఎంపీగా కాకముందే మా సోదరీమణులు ఇద్దరు మంత్రులుగా పని చేసిన సీనియర్ నేతలు. రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా పని చేసిన నాయకురాళ్లు. కానీ ఇవాళ వారి పట్ల మీ పోలీసులు ప్రవర్తించిన పద్ధతి దారుణం.
రేవంత్‌రెడ్డే బాధ్యుడు..
సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసుల వ్యవహారశైలిని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనకు సీఎం రేవంత్‌రెడ్డినే బాధ్యుడిగా పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డి మాజీ హోంశాఖ, విద్యాశాఖ మంత్రి. గత 25 సంవత్సరాలుగా ఓటమి ఎరుగని నాయకురాలు. అలాంటి నాయకురాలి జుట్టుపట్టుకొని, ఆమె గొంతుపిసికే ప్రయత్నం ఓ మొగపోలీస్ చేశాడు. ఇది మొత్తం రాష్ట్రం చేసింది. దీనికి బాధ్యుడు, దీనికి వెనుక ఉన్నది స్పష్టంగా రేవంత్‌రెడ్డి తప్పా ఎవరో కాదు. ఎవరినీ మేం నిందించడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●LPG Cylinder Booking Rules | గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. బుకింగ్ రూల్స్ మార్చిన కేంద్రం
- ●SC ST Commission Telangana | అసెంబ్లీ వద్ద దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు
- ●MLC Tata Madhu | నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా: ఎమ్మెల్సీ తాతా మధు
- ●Deepa Jewellers IPO | దీపా జ్యువెలర్స్ షేర్లు రేపే లిస్టింగ్.. ఐపీవోకు అదిరిపోయే స్పందన..
- ●ఆపరేషన్ ‘కౌంటర్ ఫోర్ట్రెస్’: కేసీఆర్ పాత వ్యూహాన్నే రివర్స్ చేస్తున్నారా రేవంత్?
- ●Raashi Khanna | బ్లాక్ ఔట్ఫిట్లో రాశీ ఖన్నా.. గ్లామర్‌తో అదరగొట్టేసిందిగా!

LPG Cylinder Booking Rules | గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. బుకింగ్ రూల్స్ మార్చిన కేంద్రం

SC ST Commission Telangana | అసెంబ్లీ వద్ద దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

MLC Tata Madhu | నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా: ఎమ్మెల్సీ తాతా మధు

Deepa Jewellers IPO | దీపా జ్యువెలర్స్ షేర్లు రేపే లిస్టింగ్.. ఐపీవోకు అదిరిపోయే స్పందన..




