Almont-Kid Syrup | తెలంగాణ ప్రజలకు డ్రగ్స్ కంట్రోల్ హెచ్చరిక.. ఆ సిరప్‌ను వాడొద్దు..
Almont-Kid Syrup | తెలంగాణలో ఆల్మంట్ కిడ్ సిరప్ ను వాడడం నిలిపివేయాలని పేర్కొంటూ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌కు కోల్‌కతాలోని ఈస్ట్ జోన్‌కు చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంపై స్పందించిన తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వెంటనే చర్యలు చేపట్టింది.
Almont-Kid Syrup | తెలంగాణలో ఆల్మంట్ కిడ్ సిరప్ ను వాడడం నిలిపివేయాలని పేర్కొంటూ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌కు కోల్‌కతాలోని ఈస్ట్ జోన్‌కు చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) హెచ్చరికలు జారీ చేసింది. ఈ సిరప్‌లో విషపూరిత పదార్థమైన ఇథిలీన్ గ్లైకాల్ (ఈజీ) ఉన్నట్లు నిర్దారించామని, కనుక ఈ సిరప్‌ను ప్రజలు వాడకూడదని, అలాగే ఈ సిరప్ అమ్మకాలు, వినియోగాన్ని నిలిపివేయాలని హెచ్చరించింది. ఈ క్రమంలో ఈ విషయంపై స్పందించిన తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వెంటనే చర్యలు చేపట్టింది. ఈ ఉత్పత్తి ఎవరి వద్ద అయినా ఉంటే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించింది. ఇందుకు గాను 1800 599 6969 అనే టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయవచ్చని తెలిపింది.
అధికారులు అప్రమత్తం..
కాగా ఈ టోల్ ఫ్రీ నంబర్ అన్ని పని దినాల్లోనూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయనుంది. ఈ సిరప్‌ను బీహార్‌లోని వైశాలి అనే ప్రాంతంలో ఉన్న హాజీపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ట్రైడస్ రెమెడీస్ అనే ఫార్మా కంపెనీ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ సిరప్‌ను అసలు వాడవద్దని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. ఇక ఇదే విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, సహాయ సంచాలకులు అందరికీ ఈ ఉత్పత్తి బ్యాచ్ కు చెందిన సమాచారాన్ని చేరవేశారు. ఈ క్రమంలోనే ఈ ఉత్పత్తి బ్యాచ్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న స్టాక్‌ను వెంటనే నిలిపివేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సిరప్‌ను ఎట్టి పరిస్థితిలోనూ పంపిణీ చేయకుండా లేదా విక్రయించకుండా రిటైలర్లు, వ్యాపారులు, పంపిణీదారులు, హాస్పిటళ్లను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదే బ్యాచ్..
ఇక ఆల్మంట్ కిడ్ సిరప్‌లో ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లు గుర్తించిన బ్యాచ్ వివరాలు ఈవిధంగా ఉన్నాయి. బ్యాచ్ నం ఏఎల్-24002 పేరిట 2025 జనవరిలో తయారై, డిసెంబర్ 2026వ తేదీ గడువుగా ఉన్న ఆల్మంట్ కిడ్ సిరప్‌లలో సదరు ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఈ వివరాలను అధికారులకు రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పంపించడమే కాకుండా ఎవరికీ ఈ సిరప్ వల్ల ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలని అన్నారు. అవసరం అయితే హాస్పిటళ్లలో ఈ సిరప్‌కు వ్యతిరేకంగా పనిచేసే యాంటీ డోట్ మందులను సిద్ధంగా ఉంచాలని అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






