NEET UG | నేడు నీట్ యూజీ .. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ, పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు..
NEET UG | దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET UG)కు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షను నిర్వహించనుంది.
NEET UG | త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET UG)కు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షను నిర్వహించనుంది. పెన్ పేపర్ విధానంలో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత నిమిషం ఆలస్యమైనా సెంటర్లలోకి అనుమతించరు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 22.80 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేయనున్నారు. దీంతో ముగ్గురు, అంతకన్నా ఎక్కువమంది గుమికూడరాదని ఆదేశాలు జారీచేశారు.
కాగా, రాష్ట్రంలో సుమారు 73,084 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా.. హైదరాబాద్ నుంచి 28,697 మంది విద్యార్థులు నీట్‌కు హాజరు కానున్నారు. వీరికోసం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, గద్వాల, జగిత్యాల, జనగామ, కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ తదితర 24 పట్టణాల్లో 199 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక హైదరాబాద్‌లోనే 69 పరీక్ష కేంద్రాలున్నాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు, డ్రెస్ కోడ్, నిషేధిత వస్తువుల వివరాలను ఎన్‌టీఏ ఇప్పటికే విడుదల చేసింది.
డ్రెస్ కోడ్
- విద్యార్థులు తేలికపాటి దుస్తులు ధరించాలి.
- పెద్ద బటన్లు, పెద్ద జిప్‌లు, ఎంబ్రాయిడరీ దుస్తులు ధరించకూడదు.
- బూట్లు వేసుకోవడానికి అనుమతి లేదు. స్లిప్పర్లు, శాండిళ్లు, లో హీల్స్ చెప్పులు మాత్రమే వేసుకోవాలి.
- ఫుల్ స్లీవ్స్, ఉన్ని దుస్తులు ధరించే విద్యార్థులు తనిఖీల కోసం పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయం కంటే ముందే చేరుకోవాలి.
- సంప్రదాయ, మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన వస్తువులను ధరించేవారు క్షుణ్ణంగా తనిఖీలు చేయడానికి వీలుగా పరీక్ష కేంద్రంలో ముందుగానే రిపోర్ట్ చేయాలి.
పరీక్ష కేంద్రంలోకి అనుమతించేవి
- అడ్మిట్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, వంటి ధ్రువీకరణ పత్రాలు).
ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్. - మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్‌లు, ఇతర కాగితాలు పరీక్ష కేంద్రాలోకి అనుమతించరు.
తాజావార్తలు
- ●Ponguleti | ప్రజలపై బీఆర్ఎస్ రూ.8.5 లక్షల కోట్ల అప్పుభారం.. రెండేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు : పొంగులేటి
- ●Hardeep Singh Nijjar | ట్రూడోకు షాక్.. నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయం లేదన్న కెనడా
- ●Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్
- ●EPFO | ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్ న్యూస్.. జూలై 15లోపు వడ్డీ జమ..
- ●Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. భారీగా పతనమైన సూచీలు..
- ●Telangana | రుదాలీల మాదిరి.. 'కల్వకుంట్ల' తెగకు ఏడుపే

Ponguleti | ప్రజలపై బీఆర్ఎస్ రూ.8.5 లక్షల కోట్ల అప్పుభారం.. రెండేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు : పొంగులేటి

Hardeep Singh Nijjar | ట్రూడోకు షాక్.. నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయం లేదన్న కెనడా

Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్

EPFO | ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్ న్యూస్.. జూలై 15లోపు వడ్డీ జమ..






