VC Sajjanar | మెడికల్ సీట్ల పేరుతో మోసాలు.. తల్లిదండ్రులారా జాగ్రత్త!
VC Sajjanar | ఆన్‌లైన్ మోసాల పట్ల నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారు హైదరాబాద్ సీపీ సజ్జనార్ (VC Sajjanar). తమ దృష్టికి వచ్చిన కొత్త తరహా మోసాల గురించి అవగాహన కల్పిస్తుంటారు. ఇదే తరహాలో నీట్ యూజీ (NEET UG) పరీక్ష నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ముఖ్య సూచన చేశారు.
VC Sajjanar | త్రినేత్ర.న్యూస్: ఆన్‌లైన్ మోసాల పట్ల నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారు హైదరాబాద్ సీపీ సజ్జనార్ (VC Sajjanar). తమ దృష్టికి వచ్చిన కొత్త తరహా మోసాల గురించి అవగాహన కల్పిస్తుంటారు. ఇదే తరహాలో నీట్ యూజీ (NEET UG) పరీక్ష నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ముఖ్య సూచన చేశారు. వైద్య వృత్తికి సమాజంలో ఉన్న అపారమైన గౌరవం, ఆ వృత్తిపై ఉన్న క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకోవాలని చూస్తున్న కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
`పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా మేనేజ్‌మెంట్ కోటాలో తక్కువ ధరకే ఎంబీబీఎస్ (MBBS) సీటు ఇప్పిస్తామనీ, ఫిలిప్పీన్స్, కిర్గిజిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, చైనా, అర్మేనియా, కరేబియన్ వంటి దేశాల్లో అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్య పూర్తి చేయవచ్చని నమ్మబలికే దళారుల మాటలు విని మోసపోవద్దు. గతంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ముఠాల వల్ల ఎందరో తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుని, విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
ఏదైనా విదేశీ యూనివర్సిటీకి వెళ్లాలనుకునే ముందు, ఆ కాలేజీకి భారత ప్రభుత్వ నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గుర్తింపు ఉందో లేదో అధికారిక వెబ్‌సైట్‌లో గానీ లేదా మీరే స్వయంగా సంప్రదించి తెలుసుకోవాలి. అడ్మిషన్ల పేరుతో దళారుల చేతికి నగదు రూపంలో లక్షల రూపాయలు ఇవ్వకండి, ఫీజులు ఏవైనా ఉంటే నేరుగా సంబంధిత యూనివర్సిటీ లేదా కాలేజీ బ్యాంక్ ఖాతాలకే చెల్లించండి.
విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి సాధించిన ఫలితాలను, మీ భవిష్యత్తు కలలను ఈ నకిలీ ఏజెంట్ల చేతుల్లో పెట్టి ఆందోళనకు గురికావద్దు. బీబీఎస్ సీట్ల పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా, డబ్బుల కోసం వేధిస్తున్నా వెంటనే సంకోచించకుండా డయల్ 100 కి సమాచారం ఇవ్వండి. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. మీ పిల్లలను డాక్టర్లుగా చూడాలనే ఆశతో మోసగాళ్ల మాయమాటల ఉచ్చులో పడకండి.` అని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026

Hyderabad Police SOCEYE | సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారా? హైదరాబాద్ పోలీసుల కొత్త ‘ఏఐ’ బ్రహ్మాస్త్రం వచ్చేసింది
మే 18, 2026

Pocso Case | పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు.. రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు..
మే 15, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



