CS Sanjay Jaju | శాసన మండలి ప్రాంగణం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
CS Sanjay Jaju | శాసన మండలి ప్రాంగణాన్ని ఆధునిక హంగులతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రతిపాదిత అభివృద్ధి, సుందరీకరణ పనుల ప్రణాళికలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలాతో కలిసి ప్రాంగణాన్ని సందర్శించి.. చేపట్టాల్సిన పనులపై అధికారులతో సమీక్షించారు.
- పర్యావరణహిత, సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యం..
- ప్రతిపాదిత పనులను పరిశీలించిన సీఎస్ సంజయ్ జాజు
CS Sanjay Jaju | శాసన మండలి ప్రాంగణాన్ని ఆధునిక హంగులతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రతిపాదిత అభివృద్ధి, సుందరీకరణ పనుల ప్రణాళికలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలాతో కలిసి ప్రాంగణాన్ని సందర్శించి.. చేపట్టాల్సిన పనులపై అధికారులతో సమీక్షించారు. శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్, వైస్ చైర్మన్, డిప్యూటీ స్పీకర్‌తో పాటు శాసనసభ, శాసన మండలి కార్యదర్శుల నివాస భవనాల నిర్మాణ ప్రతిపాదనలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అభివృద్ధి, విస్తరణపై చర్చ
శాసనసభ మాస్టర్ ప్లాన్, అనుబంధ భవనం, పరిపాలనా భవనం, శాసనసభా పక్ష కార్యాలయాలు, విశ్రాంతి భవనం, క్రీడా మైదానం, పార్కింగ్ సదుపాయాల అభివృద్ధి, విస్తరణపై చర్చించారు. అలాగే, పర్యాటక శాఖకు చెందిన భూమిని శాసనసభకు బదిలీ చేయడం, సమీపంలోని డీజీపీ కార్యాలయానికి చెందిన కొంత భూమిని కేటాయించే అంశాలపైనా సమీక్షించారు. ప్రతిపాదిత నిర్మాణాలకు గుర్తించిన స్థలాలు, ప్రస్తుత పరిస్థితులు, ఇంజినీరింగ్ అంశాలను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు.
పచ్చదనానికి విఘాతం కలగొద్దు
శాసనసభ ప్రాంగణ అభివృద్ధిలో పర్యావరణహిత, సుస్థిర విధానాలకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినట్లు సీఎస్ తెలిపారు. ఇప్పటికే ఉన్న పచ్చదనానికి ఎలాంటి నష్టం కలగకుండా, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం తగ్గేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్ నయీముద్దీన్, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ మాధవి, ఈఈ మనోహర్‌బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●PM Modi | దేశంలోనే మొట్టమొదటి.. మహిళా ఆపరేటర్లతో నడిచే మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- ●Radhika Apte | మొన్న జాన్వీ కపూర్... నేడు రాధిక ఆప్టే - టాలీవుడ్‌పై బాలీవుడ్ హీరోయిన్ విమర్శలు
- ●TRAI | టెలికాం వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఫిర్యాదులను పరిష్కరించకపోతే సంస్థలకు భారీ జరిమానాలు..
- ●Devireddy Sudheer Reddy | రేవంత్! ధరలు తగ్గించేందుకు ఏం చేస్తవో చెప్పు
- ●Supreme Court | ఢిల్లీ మార్కెట్లలో యథేచ్ఛగా టపాసుల అమ్మకాలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
- ●Anurag Kashyap | చిక్కుల్లో చిరంజీవి "కాకా" విలన్ - వారెంట్ జారీ చేసిన కోర్టు

PM Modi | దేశంలోనే మొట్టమొదటి.. మహిళా ఆపరేటర్లతో నడిచే మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Radhika Apte | మొన్న జాన్వీ కపూర్... నేడు రాధిక ఆప్టే - టాలీవుడ్‌పై బాలీవుడ్ హీరోయిన్ విమర్శలు

TRAI | టెలికాం వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఫిర్యాదులను పరిష్కరించకపోతే సంస్థలకు భారీ జరిమానాలు..

Devireddy Sudheer Reddy | రేవంత్! ధరలు తగ్గించేందుకు ఏం చేస్తవో చెప్పు





