Telangana Budget | తెలంగాణ బడ్జెట్ రూ. 3,24,234 కోట్లు
Telangana Budget | 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 3,24,234 కోట్లతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. శాసనసభలో బడ్జెట్ ప్రసంగాన్ని భట్టి విక్రమార్క చదివి వినిపిస్తున్నారు.
Telangana Budget | త్రినేత్ర.న్యూస్ : 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 3,24,234 కోట్లతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. శాసనసభలో బడ్జెట్ ప్రసంగాన్ని భట్టి విక్రమార్క చదివి వినిపిస్తున్నారు. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు.. ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ బడ్జెట్ రూ. 3,24,234 కోట్లు
మూలధన వ్యయం రూ. 47,267 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లు
ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే మా పరిపాలన లక్ష్యం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ మా పాలన సాగిస్తున్నాం. మేం పాలకులం కాదు ప్రజలకు సేవకులం. అధికారాన్ని భాద్యతగా భావించి అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకు పోతున్నాం. మేం ఇచ్చిన వాగ్దానాలను సంతృప్తికరమైన స్థాయిలో నెరవేరస్తున్నాం. ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తూ పాలనను గాడిలో పెట్టాం. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ.. శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. దేశంలో నంబర్ స్థానంలో తెలంగాణను నిలబెట్టాలన్నదే మా లక్ష్యం. అందుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నాం. ఈ రెండేండ్లలో రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టబడులు తీసుకురాగలిగాం అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
మేం ఎంచుకున్న లక్ష్యాల వైపు ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతున్నాం. పన్నులను ప్రజల అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నాం. ప్రతిపైసాకు కాపలాదారుగా ఉంటున్నాం. ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. తెలంగాణ ప్రజానీక అభ్యున్నతి పట్ల ఈ బడ్జెట్‌ను చిత్తశుద్ధితో రూపకల్పన చేశాం. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు. ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. ప్రజల స్థితిగతుల మార్పునకు దోహదపడే అంకెలు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దం పట్టేలా రూపొందించాం. పారదర్శకతతో పాలన సాగిస్తున్నాం. గొప్పల కోసం అబద్ధాలు చెప్పం. మభ్యపెట్టే మాయమాటలు చెప్పం. ప్రశ్నించిన వారిని దూషించడం మా నైజం కాదు. ఇది ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



