త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | బండి భ‌గీర‌థ్ స‌రెండ‌ర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | పోక్సో కేసులో బండి భ‌గీర‌థ్‌ను అరెస్టు చేశామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. న‌డిరోడ్డుపై దొరికితే అరెస్టు కాక స‌రెండ‌ర్ అవుత‌దా..? అని సీఎం ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On May 21, 2026, 4.26 pm IST

CM Revanth Reddy | బండి భ‌గీర‌థ్ స‌రెండ‌ర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : పోక్సో కేసులో బండి భ‌గీర‌థ్‌ను అరెస్టు చేశామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. న‌డిరోడ్డుపై దొరికితే అరెస్టు కాక స‌రెండ‌ర్ అవుత‌దా..? అని సీఎం ప్ర‌శ్నించారు. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు సీఎం స‌మాధానం ఇచ్చారు.

బండి భ‌గీర‌థ్‌ను అరెస్టు చేశామ‌ని పోలీసులు చెప్పారు. మా పోలీసు సిబ్బంది చెప్పిందే నేను న‌మ్ముతున్నాను. ఒక వేళ స‌రెండ‌ర్ చేస్తే వాళ్ల పిల్ల‌వాన్ని వాళ్ల ఇంట్లో పెట్టుకుని పోలీసుల‌ను పిలిపించి అప్ప‌జెప్పుతారు. అప్పా జంక్ష‌న్ నీ ఇళ్లా.. నా ఇళ్లా..? అప్పా జంక్ష‌న్ వ‌ద్ద పోలీసులు వాహ‌నాల‌ను త‌నిఖీ చేస్తుండ‌గా బండి భ‌గీర‌థ పోలీసుల‌కు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అత‌న్ని స‌రెండ‌ర్ చేసేది ఉంటే ఇక్క‌డ మా అబ్బాయి ఉన్నాడు స‌రెండ‌ర్ చేసుకోండి అని చెబితే అప్పుడు మ‌నం స‌రెండ‌ర్ అనుకోవ‌చ్చు. రోడ్డు మ‌ధ్య‌లో అతన్ని క‌స్ట‌డీలోకి తీసుకుని అరెస్టు చేశామ‌ని పోలీసులు చెబుతుంటే.. నేను పోలీసుల మాట న‌మ్మ‌ల్నా.. రాజ‌కీయ నాయ‌కుల మాట‌లు న‌మ్మాల్నా..? అని ప్ర‌శ్నించారు.

అత‌ను ద‌గ్గ‌రుండే పంపించి ఉండొచ్చు. అత‌ను ఏది చెబితే అదే నిజం. ఈ కేసులో ఫిర్యాదు వ‌చ్చిన వెంట‌నే ఎఫ్ఐఆర్ చేసి ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకున్న‌ది. మా చ‌ర్య‌ల‌ను ప్ర‌జ‌లు కానీ, కోర్టు కానీ ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌లేదు అని సీఎం పేర్కొన్నారు.

Advertisement
Advertisement