త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

N Ramachander Rao | గోదావ‌రి ప్రాజెక్టుల అమ‌లులో కాంగ్రెస్ నిర్ల‌క్ష్యం : ఎన్ రామ‌చంద‌ర్ రావు

N Ramachander Rao | తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని, బాధ్యతారాహిత్యాన్ని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు తీవ్రంగా ఖండించారు.

S

Telangana | Published On May 24, 2026, 6.31 pm IST

N Ramachander Rao | గోదావ‌రి ప్రాజెక్టుల అమ‌లులో కాంగ్రెస్ నిర్ల‌క్ష్యం : ఎన్ రామ‌చంద‌ర్ రావు
Advertisement

కాళేశ్వ‌రం పున‌రుద్ధ‌ర‌ణ‌లో రేవంత్ స‌ర్కార్ వైఫ‌ల్యం
రాష్ట్రానికి సుమారు 200 టీఎంసీల న‌ష్టం

N Ramachander Rao | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని, బాధ్యతారాహిత్యాన్ని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆయ‌న బ‌హిరంగ లేఖ రాశారు.

గోదావ‌రి జ‌లాల వినియోగంలో తెలంగాణ నిర్ల‌క్ష్యానికి గుర‌వుతుంద‌ని.. ఇది సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ వైఫ‌ల్య‌మేన‌ని రామ‌చంద‌ర్ రావు మండిప‌డ్డారు. గోదావ‌రి న‌దిపై 360 టీఎంసీల సాగునీటి ప్రాజెక్టుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చినా.. రాష్ట్ర ప్ర‌భుత్వం స‌ద్వినియోగం చేసుకోకుండా నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టులోని మేడిగ‌డ్డ బ్యారేజీ పున‌రుద్ధ‌ర‌ణ విష‌యంలోనూ రేవంత్ స‌ర్కార్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని రామ‌చంద‌ర్ రావు నిప్పులు చెరిగారు. దీంతో రాష్ట్రానికి సుమారు 200 టీఎంసీల న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అన్ని అనుమతులు పొందిన సీతారామ సాగర్ ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని విమర్శించారు. సమ్మక్క-సారక్క ప్రాజెక్టు విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. గోదావరి నదిపై చేపట్టాల్సిన ప్రాజెక్టులపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని, లేకపోతే తెలంగాణకు కేటాయించిన జలాలు వృథాగా పోతాయని రామచంద‌ర్ రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement