త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India-Pakistan Border | విద్యుత్‌దీపాల‌తో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డ‌ర్‌.. ఆక‌ట్టుకుంటున్న వీడియో

India-Pakistan Border | నిత్యం అత్యంత భ‌ద్ర‌త‌, హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణంతో ఉండే ఇండియా-పాకిస్థాన్ బోర్డ‌ర్ (India-Pakistan Border) రాత్రిపూట క‌నువిందు చేస్తోంది.

D

National | Published On May 26, 2026, 12.20 pm IST

India-Pakistan Border | విద్యుత్‌దీపాల‌తో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డ‌ర్‌.. ఆక‌ట్టుకుంటున్న వీడియో
Advertisement

India-Pakistan Border | నిత్యం అత్యంత భ‌ద్ర‌త‌, హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణంతో ఉండే ఇండియా-పాకిస్థాన్ బోర్డ‌ర్ (India-Pakistan Border) రాత్రిపూట క‌నువిందు చేస్తోంది. విద్యుద్ధీపాల వెలుగుల్లో ధ‌గ‌ధ‌గ మెరిసిపోతోంది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇండిగో పైల‌ట్ (IndiGo Pilot) ప్ర‌దీప్ కృష్ణ‌న్ (Pradeep Krishnan) సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

స‌ద‌రు పైల‌ట్‌ అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఈ అద్భుత‌ దృశ్యాన్ని చూసే భాగ్యం ప్ర‌యాణికుల‌కు క‌ల్పించారు. ఆ వీడియోలో కెప్టెన్ కృష్ణన్ ప్రయాణికులతో మాట్లాడుతూ.. "లేడీస్ అండ్ జెంటిల్‌మెన్.. మీరు ఫ్లైట్ నుంచి బ‌య‌ట‌కు చూస్తే ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన, అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన సరిహద్దుల్లో ఒకటైన భారత్-పాకిస్థాన్ బోర్డ‌ర్ మీకు కనిపిస్తుంది" అని అందులో పేర్కొన్నారు. నిజంగా ఆ వీడియో విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. చిమ్మ‌చీక‌ట్ల‌లో రెండు దేశాల స‌రిహ‌ద్దుల మ‌ధ్య ఎల్లో రంగులో ఉన్న ఫ్ల‌డ్ లైట్లు ఆక‌ర్షించాయి.

ఆకాశం నుండి కనిపించిన ఈ అద్భుతమైన దృశ్యం.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే 'రాడ్‌క్లిఫ్ లైన్'ను స్పష్టంగా చూపించింది. రెండు వైపులా ఉన్న సరిహద్దు అవుట్‌పోస్టులు, భద్రతా వ్యవస్థల వద్ద ఉన్న లైట్ల సమూహాలు ఇందులో స్పష్టంగా కనిపించాయి.

Advertisement
Advertisement