త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Speaker Gaddam Prasad Kumar | మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ నోటీసులు

Speaker Gaddam Prasad Kumar | త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేసి వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించిన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ లీగ‌ల్ నోటీసులు పంపించారు.

S

Telangana | Published On Jan 23, 2026, 5.00 pm IST

Speaker Gaddam Prasad Kumar | మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ నోటీసులు
Advertisement

Speaker Gaddam Prasad Kumar | త్రినేత్ర‌.న్యూస్ : త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేసి వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించిన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ లీగ‌ల్ నోటీసులు పంపించారు. మానసికంగా క్షోభ పెట్టినందుకు రూ. 10 కోట్లు నష్టపరిహారం చెల్లించడంతో పాటుగా వారం రోజుల్లో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అని ప్ర‌సాద్ కుమార్ డిమాండ్ చేశారు. లేని యెడ‌ల చ‌ట్టం ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

ఈ నెల 14, 19 తేదీల్లో మెతుకు ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. త‌న‌పై నిరాధార‌, త‌ప్పుడు, అస‌త్య‌, అభూత క‌ల్ప‌న‌లు, క‌ట్టు క‌థ‌ల‌తో కూడిన అవినీతి ఆరోప‌ణ‌లు చేశార‌ని స్పీక‌ర్ పేర్కొన్నారు. త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి, గౌర‌వానికి భంగం క‌లిగించే విధంగా వ్యాఖ్య‌లు చేశార‌ని ఆయ‌న నోటీసుల్లో పేర్కొన్నారు.

మెతుకు ఆనంద్ ఏమ‌న్నారంటే..?

జ‌న‌వ‌రి 19న మీడియాతో మాట్లాడుతూ.. శాసన వ్యవస్థలో అత్యున్నతమైన శాసన సభాపతి పదవిని అవమానించే విధంగా శాసనసభ్యుల అనర్హత అంశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వందల కోట్లు లంచంగా తీసుకున్నారని మెతుకు ఆనంద్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది రాజ్యాంగ బద్దమైన పదవిని అవమానించడమే. అదేవిధంగా వికారాబాద్ పురపాలక సంఘాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారనే కట్టు కథలు అల్లార‌ని స్పీక‌ర్ పేర్కొన్నారు.

జనవరి 14 నిర్వ‌హించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనను బుల్లెట్ రాజు అంటూ అవహేళనగా మాట్లాడి వ్యక్తిగతంగా మనసును గాయపరిచారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుండి లంచాలు వసూలు చేస్తున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారని ప్ర‌సాద్ కుమార్ తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement