Alleti Maheshwar Reddy | ఇది క్విడ్ ప్రోకో కాదా..? రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్
Alleti Maheshwar Reddy | టీజీఐసీసీ పరిధిలోని భూములను రాత్రికి రాత్రే రాఘవ కన్‌స్ట్రక్షన్ స్వాధీనం చేసుకుని రెసిడెన్షియల్ బిల్డింగ్‌లు నిర్మించడం ఎంత వరకు సమంజసం అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రికి సంబంధించిన కంపెనీ ఇలా చేయడం క్విడ్ ప్రోకో కాదా..? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
Alleti Maheshwar Reddy | త్రినేత్ర.న్యూస్ : టీజీఐసీసీ పరిధిలోని భూములను రాత్రికి రాత్రే రాఘవ కన్‌స్ట్రక్షన్ స్వాధీనం చేసుకుని రెసిడెన్షియల్ బిల్డింగ్‌లు నిర్మించడం ఎంత వరకు సమంజసం అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రికి సంబంధించిన కంపెనీ ఇలా చేయడం క్విడ్ ప్రోకో కాదా..? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 22ఏ భూముల అంశంపై శాసనసభలో చర్చ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రసంగించారు.
ఫోరెన్సిక్ ఆడిట్‌లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. 23 లక్షల ఎకరాలు, 13 వేల ట్రాన్సక్షన్ల ద్వారా ట్రాన్స్‌ఫర్ అయ్యాయని చెప్పారు. ఎవరి పేరుమీద ట్రాన్స్‌ఫర్ చేశారు. దానిపై చర్యలు ఏం తీసుకుంటారు. రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని, భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నామని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
ఫినిక్స్ టెక్ జోన్ ప్రయివేటు లిమిటెడ్‌కు కేటాయించిన భూములు ఇండస్ట్రీయల్ ఏరియాకు సంబంధించినవి. టీజీఐసీసీ నుంచి 7 ఎకరాల 11 గుంటలు డీనోటిఫై చేసిన భూమికి.. రాత్రికి రాత్రే రాఘవ కన్‌స్ట్రక్షన్ ఎంటర్ కాగానే రెక్కలొచ్చాయి. సదరు భూమి రెసిడెన్షియల్‌గా కన్‌వర్ట్ అయి 63 అంతస్తుల టవర్స్‌తో నిర్మాణం చేస్తుంటే ఏ రకంగా చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. మంత్రిగా ఉన్న వ్యక్తే ఇలా చేయడం క్విడ్ ప్రోకో కిందకు వస్తుంది. సెజ్‌కు సంబంధించిన భూమిని ఫినిక్స్ నుంచి కాంట్రాక్ట్ తీసుకుని ఏ రకంగా నిర్మాణం చేస్తున్నారో స్పష్టత ఇవ్వాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఐకియా వద్ద ఉన్న 15 ఎకరాల భూమికి రాత్రికి రాత్రే పట్టాలు ఇస్తారు. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ పట్టాలు ఇచ్చారు. మళ్లీ సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇలా పట్టాలు జారీ చేసిన అధికారులు ఎవరు..? ఏం చర్యలు తీసుకున్నారు. గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఐడీఎల్‌లో జరిగిన భూ కుంభకోణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూములను అక్రమంగా బదలాయించుకున్న భూములను 22ఏలో ఎందుకు పెట్టడం లేదు. అనేకమైన కాలనీలు, బిల్డింగ్‌లు, అపార్ట్‌మెంట్లను 22ఏ నుంచి తీయించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పినట్టు వార్త చూశాను. సంతోషంగా ఉంది. లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. ఫోరెన్సిక్ రిపోర్టు బయటపెట్టాలి. జ్యుడిషీయల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Pak Ship Collides With Indian Navy Unit | అంతర్జాతీయ జలాల్లో అనూహ్య పరిణామం.. భారత నౌకను ఢీ కొట్టిన పాక్ నౌక
- ●Special Trains | వినాయక చవితి రద్దీ.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
- ●Dinesh Chowdary vs Balmoor Venkat | అప్పుడు నువ్వు కేటీఆర్ కాళ్లు మొక్కింది నిజం కాదా?
- ●Mecca | చరిత్రలోనే తొలిసారి.. హౌతీల దాడులతో మక్కాలో హై అలర్ట్
- ●Speaker Gaddam Prasad Kumar | దౌర్జన్యంగా మైక్ లాక్కున్నారు.. సభలో స్పీకర్ ఆవేదన
- ●UPI | వినియోగదారులకు పేటీఎం గుడ్‌న్యూస్.. యూపీఐ చార్జిలు విధించబోమని ప్రకటన..

Pak Ship Collides With Indian Navy Unit | అంతర్జాతీయ జలాల్లో అనూహ్య పరిణామం.. భారత నౌకను ఢీ కొట్టిన పాక్ నౌక

Special Trains | వినాయక చవితి రద్దీ.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Dinesh Chowdary vs Balmoor Venkat | అప్పుడు నువ్వు కేటీఆర్ కాళ్లు మొక్కింది నిజం కాదా?

Mecca | చరిత్రలోనే తొలిసారి.. హౌతీల దాడులతో మక్కాలో హై అలర్ట్





