త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | బీఆర్ఎస్ నేత‌ల‌ను ఎందుకు జైలుకు పంప‌డం లేదు..?

Bandi Sanjay | బీఆర్ఎస్ నేతలంతా శుద్ద పూసలా? ఏ ఒక్క అవినీతి చేయలేదా?. అవినీతికి పాల్పడుతున్న బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపడం లేదు అని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ నిల‌దీశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ అవినీతిపై బీఆర్ఎస్ ఎందుకు నిల‌దీయ‌డం లేదు.. ఈ రెండు పార్టీల తీరును చూసి ప్ర‌జ‌లు ఆస్య‌హించుకుంటున్నార‌ని బండి సంజ‌య్ మండిప‌డ్డారు.

S

Telangana | Published On Sep 15, 2026, 7.21 pm IST

Bandi Sanjay | బీఆర్ఎస్ నేత‌ల‌ను ఎందుకు జైలుకు పంప‌డం లేదు..?
Advertisement

బీఆర్ఎస్ నేతలంతా శుద్ద పూసలా? ఏ ఒక్క అవినీతి చేయలేదా?
అసెంబ్లీలో కాంగ్రెస్ అవినీతిపై బీఆర్ఎస్ ఎందుకు నిలదీయడం లేదు
రెండు పార్టీల తీరును చూసి జనం అస్య‌హించుకుంటున్నారు
అవినీతి అనే నాణేనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ బొమ్మ బొరుసు లాంటివి
భూములు అమ్ముకుని ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఏర్పడింది
శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మాదిరిగా తెలంగాణ మారే ప్రమాదం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ నేతలంతా శుద్ద పూసలా? ఏ ఒక్క అవినీతి చేయలేదా?. అవినీతికి పాల్పడుతున్న బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపడం లేదు అని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ నిల‌దీశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ అవినీతిపై బీఆర్ఎస్ ఎందుకు నిల‌దీయ‌డం లేదు.. ఈ రెండు పార్టీల తీరును చూసి ప్ర‌జ‌లు ఆస్య‌హించుకుంటున్నార‌ని బండి సంజ‌య్ మండిప‌డ్డారు.

గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విస్తృత‌ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. అందులో భాగంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులంతా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఈరోజు సాయంత్రం కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

ఈనెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడకలు నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలను విజయవంతం చేయాలని ప్రజలను కోరుతున్నా. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాట తప్పాయి. మజ్లిస్ పార్టీకి భయపడి ఆ పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపడం లేదు. తెలంగాణ అమరవీరుల బలిదానాలను పట్టించుకోకపోవడం, సమాజానికి చూపకపోవడం సిగ్గు చేటు అని బండి సంజ‌య్ మండిప‌డ్డారు.

రాబోయే తరాలకు స్పూర్తి నింపేలా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తాం. పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యంశాలుగా పొందుపరుస్తాం. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు సిగ్గు చేటు. రెండు పార్టీలు కుమ్కక్కై ప్రజా సమస్యలను దారి మళ్లిస్తున్నాయి.

కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే. ఇద్దరూ డ్రామా ఆర్టిస్టుల్లా మారారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. బీఆర్ఎస్ నేతలంతా శుద్ద పూసలా? ఏ ఒక్క అవినీతి చేయలేదా?. అవినీతికి పాల్పడుతున్న బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపడం లేదు. అసెంబ్లీలో కాంగ్రెస్ అవినీతిపై బీఆర్ఎస్ ఎందుకు నిలదీయడం లేదు. రెండు పార్టీల తీరును చూసి జనం అసహ్యించుకుంటున్నారు. అసెంబ్లీ సభా సమయాన్ని వృధా చేయడం తప్ప రెండు పార్టీలు చేస్తుందేమిటి? అని నిల‌దీశారు.

అవినీతి అనే నాణేనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ బొమ్మ బొరుసు లాంటివి. పార్లమెంట్‌లో నల్ల టీషర్టులు వేసుకొచ్చిన రాహుల్ గాంధీని, కాంగ్రెస్ ఎంపీలను లోక్ సభ స్పీకర్ సస్పెండ్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి అక్కడో విధానం, ఇక్కడో విధానం అవలంబించడం సిగ్గు చేటు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి. కర్నాటక సీఎం శివకుమార్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.కేంద్రమే ఆదుకోవాలని శివకుమార్ వేడుకునే దుస్థితి ఏర్ప‌డింద‌న్నారు.

తెలంగాణలోనూ అదే దుస్థితి. భూములు అమ్ముకుని ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఏర్పడింది. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మాదిరిగా తెలంగాణ మారే ప్రమాదం. కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం. ఈ అంశంపై నేను స్పందించాల్సిన అవసరం లేదు అని బండి సంజ‌య్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement