త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gig Workers | గిగ్ వ‌ర్క‌ర్ల బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం

Gig Workers | గిగ్ వ‌ర్క‌ర్ల బిల్లుకు తెలంగాణ శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌గా చ‌ర్చ అనంత‌రం ఆమోదం తెలిపింది.

S

Telangana | Published On Mar 30, 2026, 5.06 pm IST

Gig Workers | గిగ్ వ‌ర్క‌ర్ల బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం
Advertisement

గిగ్ వ‌ర్క‌ర్ల‌ను ప‌ట్టించుకోవాలి
లేదంటే అగ్రిగేట‌ర్ల‌కు పెనాల్టీ విధిస్తాం
ఈ చ‌ట్టం వ‌ల్ల కంపెనీల‌కు ఎలాంటి న‌ష్టం ఉండ‌దు
ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్
శాస‌న‌స‌భ‌లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెల్ల‌డి

Gig Workers | త్రినేత్ర‌.న్యూస్ : గిగ్ వ‌ర్క‌ర్ల బిల్లుకు తెలంగాణ శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌గా చ‌ర్చ అనంత‌రం ఆమోదం తెలిపింది. ఈ సంద‌ర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. గిగ్ వ‌ర్క‌ర్ల‌ను పట్టించుకోక‌పోతే అగ్రిగేట‌ర్ల‌కు పెనాల్టీ వేస్తాం. మొద‌టిసారి త‌ప్పు చేస్తే రూ. 50 వేలు, రెండోసారి త‌ప్పుచేస్తే రూ. ల‌క్ష‌, మూడోసారి త‌ప్పు చేస్తే రూ. ల‌క్షా 50 వేలు జ‌రిమానా విధిస్తాం. గిగ్ వ‌ర్క‌ర్ల‌తో మాట్లాడి డ్రాఫ్ట్ బిల్లు రెడీ చేశాం. ఈ బిల్లు రూపొందించేందుకు ఐదుసార్లు స‌మావేశాలు నిర్వ‌హించాం. ఈ చ‌ట్టం వ‌ల్ల కంపెనీల‌కు ఎలాంటి న‌ష్టం ఉండ‌దు. గిగ్ వ‌ర్క‌ర్ల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం. ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని మంత్రి వివేక్ తెలిపారు.

బిల్లులోని ముఖ్యాంశాలు ఇవే..

  • గిగ్ వ‌ర్క‌ర్ల‌ రిజిస్ట్రేషన్, పర్యవేక్షణకు ‘సామాజిక భద్రత , సంక్షేమ బోర్డు’ను ఏర్పాటు చేస్తారు. ఇందులో మహిళలు, దివ్యాంగులకు ప్రాతినిధ్యం ఉంటుంది.
  • ప్లాట్‌ఫాం ఆధారిత కార్మికులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూఐడీ) కేటాయిస్తారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా వారికి అందుతాయి.
  • అగ్రిగేటర్లు (సంస్థలు) జరిపే లావాదేవీల నుంచి 1శాతం నుంచి 2 వరకు నిధులను సేకరించి, వాటిని సంక్షేమ నిధికి జమ చేస్తారు. ఈ నిధిని కార్మికుల బీమా, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ , పెన్షన్, ప్రసూతి ప్రయోజనాలకు ఉపయోగిస్తారు.
  • యాజమాన్యాలకు, కార్మికులకు మధ్య వచ్చే తగాదాలను పరిష్కరించేందుకు బలోపేతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. ఇబ్బందుల నివారణకు ప్లాట్‌ఫాం స్థాయి కమిటీలు పనిచేస్తాయి.
  • కార్మికులను పనిలో నుంచి తొలగించినా లేదా పేమెంట్లు ఆపేసినా.. తక్షణమే ఫిర్యాదు చేసేందుకు 'ప్లాట్‌ఫాం స్థాయి కమిటీలు' జిల్లా స్థాయి అధికారులతో కూడిన యంత్రాంగం ఉంటుంది.
  • ఇంతకాలం యాప్ కంపెనీలు ఏ ప్రాతిపదికన ఆర్డర్లు ఇస్తున్నాయి, పేమెంట్లు ఎలా లెక్కిస్తున్నాయి అనే దానిపై స్పష్టత ఉండేది కాదు. ఇకపై యాప్ కంపెనీలు ఇష్టమొచ్చినట్లు రేట్లు తగ్గించడం, కార్మికులను ఇబ్బంది పెట్టడం కుదరదు. కార్మికులకు ఇచ్చే పేమెంట్లలో పారదర్శకత ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు జరిమానాలు విధిస్తారు.
Advertisement

తాజావార్తలు

Advertisement