త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana – AP | జ‌ల వివాదాలు.. 12 అంశాల‌ను చ‌ర్చించాల‌ని ప్ర‌తిపాదించాం

Telangana - AP | తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య జ‌ల‌ వివాదాల‌ను ప‌రిష్క‌రించేందుకు ఏర్పాటైన క‌మిటీ.. శుక్ర‌వారం కేంద్రం జ‌ల సంఘం కార్యాల‌యంలో స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభ‌మైన స‌మావేశం దాదాపు రెండు గంట‌ల పాటు కొన‌సాగింది.

S

Telangana | Published On Jan 30, 2026, 6.58 pm IST

Telangana – AP | జ‌ల వివాదాలు.. 12 అంశాల‌ను చ‌ర్చించాల‌ని ప్ర‌తిపాదించాం
Advertisement

Telangana - AP | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య జ‌ల‌ వివాదాల‌ను ప‌రిష్క‌రించేందుకు ఏర్పాటైన క‌మిటీ.. శుక్ర‌వారం కేంద్రం జ‌ల సంఘం కార్యాల‌యంలో స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభ‌మైన స‌మావేశం దాదాపు రెండు గంట‌ల పాటు కొన‌సాగింది. కేంద్ర‌ జ‌ల సంఘం చైర్మ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశానికి సీడ‌బ్ల్యూసీ అధికారులు, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, ఎన్‌డ‌బ్ల్యూడీఏ చైర్మ‌న్లు, కేంద్ర జ‌ల‌సంఘం చీఫ్ ఇంజినీర్, తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల అధికారులు హాజ‌ర‌య్యారు. నీటి పంప‌కాలు, స‌మ‌స్య‌లు, వివాదాల‌పై అధికారుల క‌మిటీ తొలిసారి భేటీ అయింది.

స‌మావేశం ముగిసిన అనంత‌రం తెలంగాణ ఇరిగేష‌న్ సెక్ర‌ట‌రీ రాహుల్ బొజ్జా మీడియాతో మాట్లాడారు. దాదాపు 2 గంట‌ల పాటు కొన‌సాగిన స‌మావేశంలో తెలంగాణ నుంచి 12 అంశాల‌ను చ‌ర్చించాల‌ని ప్ర‌తిపాదించిన‌ట్లు తెలిపారు. పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టొద్దని స్పష్టం చేశాం. రెండు రాష్ట్రాల మధ్య పలు జల వివాదాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి జలాలపై అనేక అంశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో ఏపీ తన అజెండాను చెప్పలేదు. తదుపరి సమావేశం సీడబ్ల్యూసీ నిర్ణయిస్తుంది అని రాహుల్ బొజ్జా పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement