తెలంగాణ వాళ్లకు అన్నీ నీళ్లా.. మేం అస్సలు ఒప్పుకోం: చంద్రబాబు నాయుడు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా మారలేదు. రెండు రాష్ట్రాలు బావుండాలని ఓ వైపు కోరుకుంటూనే తెలంగాణ కంట్లో వేలు పెట్టివ పొడుస్తున్నారు. ఎలాగంటే...
గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు
సంక్షిప్త సారాంశం
గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిబంధనలను ఉల్లంఘిస్తూ.. అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. దీంతో ఆంధ్రప్రదేశ్ కు జీవధారలైన పోలవరం ప్రాజెక్టుకు, సర్ ఆర్థర్ కాటన్ బరాజ్ లకు నీళ్లే అందకుండా పోతున్నాయి. తెలంగాణ ప్రాజెక్టుల సామర్థ్యం 273 టీఎంసీలకు మించి లేదు. అయినా వాళ్లు 967 టీఎంసీలు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇది అన్యాయం....
తెలంగాణ వాళ్లకు అన్నీ నీళ్లా..
మేం అస్సలు ఒప్పుకోం
గోదావరి నీళ్లలో మాకు
900 టీఎంసీలు కావాలి
967 టీఎంసీలు తమమే అని
తెలంగాణ క్లెయిమ్ చేసుకుంటున్నది
తెలంగాణకు దక్కాల్సింది కేవలం 273 టీఎంసీలే
తెలంగాణ కడుతున్నవన్నీ అక్రమ ప్రాజెక్టులే
అందుకే గోదావరిపై కొత్త ట్రిబ్యునల్ వేయండి
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు
త్రినేత్ర.న్యూస్ :
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తనకు రెండు కళ్ల లాంటి వంటూ.. జనం మరిచిపోతున్నప్పుడల్లా ఊదరగొట్టే డైలాగులు పలుకుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణకు అందుతున్న నీళ్లపై తన అక్కసును బయట పెట్టుకున్నారు. గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ అక్రమమంటూ పాత వాదననే సరికొత్తగా లేవనెత్తారు. తెలంగాణ ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గోదావరి జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి విన్నవించారు.
తెలంగాణ ప్రాజెక్టులు అక్రమం...
కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ నారా చంద్రబాబు నాయుడు గత ఏడాది డిసెంబరు 18న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు లేఖ రాశారు. దాని సారాంశం ఏమిటంటే..
తెలంగాణకు అన్నీ నీళ్లా..?
గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిబంధనలను ఉల్లంఘిస్తూ.. అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. దీంతో ఆంధ్రప్రదేశ్ కు జీవధారలైన పోలవరం ప్రాజెక్టుకు, సర్ ఆర్థర్ కాటన్ బరాజ్ లకు నీళ్లే అందకుండా పోతున్నాయి. తెలంగాణ ప్రాజెక్టుల సామర్థ్యం 273 టీఎంసీలకు మించి లేదు. అయినా వాళ్లు 967 టీఎంసీలు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇది అన్యాయం....
మొత్తం నీళ్లు 1435 టీఎంసీలు
2024లో వ్యాప్కోస్ అందించిన నివేదిక ప్రకారం.. గోదావరి జలాలపై సంయుక్త ఏపీ ఆధారపడేది. 2023 జూన్ లో చేసిన సర్వే ప్రకారం.. సంయుక్త ఏపీలో 1435 టీఎంసీలు ప్రవహిస్తున్నదని తేలింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో గోదావరి డెల్టా ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు, పోలవవరం వంటి ప్రాజెక్టులన్నింటికీ కలిపి 902 టీఎంసీలు అవసరమవుతాయి. అదే సమయంలో తెలంగాణ .. ప్రస్తుతం ఉన్న, త్వరలో కట్టబోయే ప్రాజెక్టులన్నింటికీ కలిపి గోదావరిలో 967 టీఎంసీలు కావాలని అంటున్నది. పక్క రాష్ట్రంతో పరస్పర ఒప్పందం లేకుండా.. అన్ని నీళ్లను తెలంగాణ క్లెయిమ్ చేసుకోలేదు. అది సాధ్యం కాదు.
తక్షణమే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి
తెలంగాణకు గోదావరి నదీ జలాల నుంచి దక్కాల్సినది కేవలం 273 టీఎంసీలు మాత్రమే. కానీ తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల ఆధారంగా గోదావరి లో హక్కును ఏకపక్షంగా వాడుకున్నది. తెలంగాణ కేంద్ర జలవనరుల కమిషన్ ఇచ్చిన అనుమతుల ఆధారంగా 940 టీఎంసీలు తమవేనని చెబుతున్నది. కాబట్టి వెంటనే గోదావరి జలాల సమ పంపకంపై వెంటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నా. ఈ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి 2020 అక్టోబర్ 6 నే.. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ .. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు విన్నవించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.... అంటూ చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ






