Saraswati Antya Pushkaralu 2026 | సరస్వతి అంత్య పుష్కరాలకు గవర్నర్‌కు ఆహ్వానం
Saraswati Antya Pushkaralu 2026 | లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషన్ హనుమంతరావు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మే నెలలో ప్రారంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు గవర్నర్‌ను ఆహ్వానించారు.
Saraswati Antya Pushkaralu 2026 | త్రినేత్ర.న్యూస్ : లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషన్ హనుమంతరావు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మే నెలలో ప్రారంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు గవర్నర్‌ను ఆహ్వానించారు.
గోదావరి పుష్కరాలు జూన్ 26 నుంచి జులై 7 వరకు, సరస్వతి అంత్య పుష్కరాలు మే 21 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నారు. ఈ పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి గవర్నర్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పుష్కరాలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు.
భక్తుల వసతి సదుపాయాలు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ చర్యలు, ముఖ్య ఆలయాలు వాటి ప్రాధాన్యత, శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై గవర్నర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిశోర్ కూడా పాల్గొన్నారు.
గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యే
అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ బుధవారం లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.
గవర్నర్‌ను కలిసిన ఎంసిఈఎంఈ కమాండెంట్
ఎంసిఈఎంఈ, సికింద్రాబాద్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే (ఏవీఎస్‌ఎం, వీఎస్‌ఎం) బుధవారం లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంసిఈఎంఈలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలు, సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలను గవర్నర్ కు వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- ●Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్
- ●CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
- ●IND Vs SL | శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. తొలిసారి జట్టులోకి సారాంశ్ జైన్
- ●Allu Arjun | బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనకున్న కారణమిదే - ఐకాన్ స్టార్‌పై నెటిజన్ల ప్రశంసలు

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్

CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి

TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్





