Inter-State Water Disputes India | తుంగభద్ర వద్ద సీఎంల భేటీ.. కరచాలనాల వెనుక దాగిన 30 జల వివాదాలివే!
తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవంలో మూడు రాష్ట్రాల సీఎంలు కలిశారు. జల వివాదాలు వద్దని కేంద్రమంత్రి సూచించారు. కానీ, ఈ దశాబ్దాల నీటి సమస్యలకు పరిష్కారం ఎప్పుడు?
- తుంగభద్ర డ్యామ్ వద్ద తెలంగాణ, ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రుల భేటీ, 33 గేట్ల ప్రారంభం
- నదుల అనుసంధానంతో వివాదాలకు చెక్ పెట్టొచ్చని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సూచన
- కృష్ణా జలాలు, పోలవరం, ఆల్మట్టి సహా మూడు రాష్ట్రాల మధ్య ఉన్న 30 ప్రధాన నీటి వివాదాలపై దొరకని స్పష్టత
- ప్రాజెక్టులు, ట్రిబ్యునల్ తీర్పులు, నీటి కేటాయింపులపై ఇంకా కొనసాగుతున్న రాష్ట్రాల పంచాయితీలు
Inter-State Water Disputes India | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ, ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులు ఒక చోట కలిశారు. తుంగభద్ర పై ఏర్పాటు చేసిన 33 గేట్లను ప్రారంభించారు. ఇంతవరకు బాగుంది. తరువాత కేంద్ర జలవనరుల మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశమై ఇకపై జలాలజగడాలు పెట్టుకోవద్దని నిర్ణయించుకున్నట్టు ఉమ్మడిగా ప్రకటించారు. ఇదీ బాగానే ఉంది. రాష్ట్రాల మధ్యన ప్రధానంగా ఉన్న నీటి సమస్యలను పరిష్కరించుకుంటే అంతకంటే కావలసింది ఏముంది? కానీ, నీటి సమస్యలు ఎలా పరిష్కరించుకుంటారన్నదే సమస్య. ఇందుకు సీఆర్ పాటిల్ నదుల అనుసంధానాన్ని ప్రస్తావించారు. దానివల్ల గుజరాత్ లో, మధ్య ప్రదేశ్ లో మేలు జరిగిందనీ వివరించారు. కానీ, ఈ మూడు రాష్ట్రాల మధ్యన ఉన్న నీటి సమస్యల విషయంలో ఎవరూ ఏమీ ప్రస్తావించలేదు. ఈ సమస్యలను ఎలా పరిస్కరిస్తారన్న దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మూడు రాష్ట్రాల మధ్యన ముఖ్యంగా ఉన్న వివాదాస్పద అంశాలు ఇవి. వీటిని పరిష్కారం ఏది?
1. కృష్ణా జలాల వాటా వివాదం
రాష్ట్ర విభజన (2014) తర్వాత కృష్ణా నీటిని ఎలా పంచుకోవాలన్న దానిపై వివాదం.
• తెలంగాణ: బేసిన్ విస్తీర్ణం, అవసరాల ఆధారంగా వాటా కావాలని వాదిస్తోంది.
• ఆంధ్రప్రదేశ్: పాత వినియోగ హక్కులను ప్రస్తావిస్తోంది.
2. శ్రీశైలం జలాశయం నిర్వహణ
• విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి వినియోగం.
• దిగువ రాష్ట్రాలకు నీటి విడుదల.
• జలాశయం కనీస నీటి మట్టం అంశంపై విభేదాలు.
3. నాగార్జునసాగర్ నీటి పంపిణీ
• ఎడమ, కుడి కాలువల ద్వారా నీటి విడుదల.
• గేట్ల నిర్వహణ, నీటి వాటాలపై తరచూ వివాదాలు.
4. కేఆర్ఎంబీ (KRMB) అధికార పరిధి
• Krishna River Management Board అధికారాలపై రెండు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు.
5. రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation Scheme)
• తెలంగాణ అభ్యంతరం
అదనపు నీటి మళ్లింపు జరుగుతుందని ఆరోపణ.
కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపులకు విరుద్ధమని వాదన.
6. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్
• నీటి మళ్లింపు సామర్థ్యం పెంపుపై తెలంగాణ అభ్యంతరాలు.
7. గోదావరి జలాల వినియోగం
• గోదావరి-కృష్ణా అనుసంధానం ద్వారా నీటి మళ్లింపుపై తెలంగాణ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
8. పోలవరం ప్రభావం
• Polavaram Project కారణంగా ముంపు గ్రామాలు, పునరావాస అంశాలు.
9. ఎగువ కృష్ణా ప్రాజెక్టులు
• కర్ణాటకలో కొత్త ఆనకట్టలు, నిల్వలు.
• దిగువ రాష్ట్రాల ప్రవాహాలపై ప్రభావం ఉంటుందనే తెలంగాణ ఆందోళన.
10. ఆల్మట్టి డ్యామ్ నిల్వ సామర్థ్యం
• Almatti Dam వద్ద అధిక నిల్వల వల్ల దిగువ రాష్ట్రాలకు నీటి ప్రవాహం తగ్గుతుందనే వాదన.
11. నారాయణపూర్ ప్రాజెక్టు
• కృష్ణా నీటి వినియోగం, నిల్వలపై వివాదాలు.
12. తుంగభద్ర జలాల వినియోగం
• కర్ణాటక అదనపు వినియోగం చేస్తున్నదని తెలంగాణ ఆరోపణ.
• ముఖ్యంగా ఆర్డీఎస్ ప్రాంత రైతులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
13. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS)
• Rajolibanda Diversion Scheme వద్ద నీటి పంపిణీపై దశాబ్దాలుగా వివాదం.
• కాలువల ద్వారా అనధికారిక నీటి మళ్లింపు ఆరోపణలు.
14. కురిడి ఎత్తిపోతల పథకం
• తెలంగాణ తాజా అభ్యంతరాలు.
• ఆర్డీఎస్ ప్రవాహాలపై ప్రభావం ఉంటుందని వాదిస్తోంది.
15. చిక్కాలపర్వి బ్యారేజ్
• తుంగభద్రపై నిర్మాణానికి తెలంగాణ అభ్యంతరం.
16. చిక్కాలమంచి బ్యారేజ్
• దిగువ ప్రాంతాల నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని తెలంగాణ అభిప్రాయం.
17. తుంగభద్ర బోర్డు నియంత్రణ
• నీటి విడుదలలు, నిర్వహణ, నిల్వలపై అప్పుడప్పుడు విభేదాలు.
18. కృష్ణా జలాల తుది కేటాయింపులు
• Krishna Water Disputes Tribunal తీర్పుల అమలు.
19. బచావత్ ట్రిబ్యునల్ నిబంధనలు
• తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వేర్వేరు వ్యాఖ్యానాలు చేస్తుంటాయి.
20. రెండో, మూడో ట్రిబ్యునల్ నిర్ణయాల అమలు
• రాష్ట్రాల మధ్య ఇంకా పూర్తి ఏకాభిప్రాయం లేదు.
21. బనకచర్ల (పోలవరం–బనకచర్ల) వివాదం
• ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టు.
• పోలవరం నుంచి గోదావరి జలాలను రాయలసీమ వైపు మళ్లించే ప్రణాళిక.
• తెలంగాణ అభ్యంతరం:
గోదావరి వాటాలపై ప్రభావం.
ట్రిబ్యునల్ నిబంధనలు, పునర్విభజన చట్టం ఉల్లంఘన.
"వరద జలాలు" పేరిట భవిష్యత్తులో పెద్ద ఎత్తున మళ్లింపులకు అవకాశం.
22. గోదావరి–కృష్ణా–కావేరీ అనుసంధానం
• కేంద్రం దీర్ఘకాలికంగా పరిశీలిస్తున్న గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ లింక్ ఆలోచన.
• తెలంగాణ వాదన:
రాష్ట్ర అవసరాలు పూర్తిగా తీర్చకముందే మిగులు జలాల పేరుతో తరలించడం సరికాదు.
బేసిన్ హక్కులు, భవిష్యత్తు అవసరాలు పరిగణనలోకి తీసుకోవాలి.
23. పోలవరం ప్రాజెక్టు విస్తరణ, అదనపు మళ్లింపులు
• తెలంగాణ వాదన ప్రకారం పోలవరం అసలు అనుమతుల కంటే ఎక్కువ నీటిని తరలించేలా వ్యవస్థను విస్తరిస్తున్నారనే అభ్యంతరం.
• దీనిపై న్యాయపరమైన పోరాటాలు కూడా జరిగాయి.
24. పోతిరెడ్డిపాడు
• కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించే సామర్థ్య పెంపుపై తెలంగాణ చాలా కాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
• ఇది తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని వాదన.
25. నాగార్జునసాగర్ కుడి కాలువ (Right Canal) సామర్థ్య పెంపు
• కుడికాలువ వెడల్పు, ప్రవాహ సామర్థ్యాల పెంపుపై తెలంగాణలో తరచూ అనుమానాలు వ్యక్తమవుతుంటాయి.
• అదనపు నీటి వినియోగానికి దారితీస్తుందనే రాజకీయ వాదనలు ఉన్నాయి.
26. నాగార్జునసాగర్ నియంత్రణ వివాదం
• డ్యామ్ నిర్వహణ, గేట్ల నియంత్రణ, నీటి విడుదలలపై రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణలు.
• 2023లో సాగర్ వద్ద రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.
27. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS)
• తెలంగాణకు అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటి.
• ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు:
కృష్ణా జలాల లభ్యత.
పర్యావరణ, సాంకేతిక అనుమతులు.
• ఈ కారణాలతో NGT, కేంద్ర అనుమతుల అంశాలు వివాదాస్పదమయ్యాయి.
28. పాలమూరు–రంగారెడ్డి నీటి కేటాయింపులు
• 90 టీఎంసీల వినియోగం.
• అసలు రూపకల్పన, మార్పులు, అనుమతులపై వివాదం.
29. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు
• కర్ణాటక ఆల్మట్టి సామర్థ్యం పెంచే ప్రయత్నాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ గతంలో అభ్యంతరం తెలిపాయి.
• దిగువ రాష్ట్రాలకు వచ్చే ప్రవాహాలపై ప్రభావం ఉంటుందనే వాదన.
30. తుంగభద్రపై కొత్త బ్యారేజీలు
• కురిడి.
• చిక్కాలపర్వి.
• చిక్కాలమంచి.
• తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ కు రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రధాన అంశాలు ఇవి.

కోవెల సంతోష్ కుమార్
సీనియర్ జర్నలిస్ట్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●London Climate Action Week 2026 | గ్రీన్ ఇండియా చాలెంజ్ రికార్డ్స్, సంతోష్ కుమార్ విజన్‌పై అంతర్జాతీయ నేతల ప్రశంసలు
- ●Ritika Nayak | రెడ్ శారీలో మెరిసిన మిరాయ్ హీరోయిన్
- ●Tungabhadra Dam Gates | మైసూరు రాజులు సైతం రైతుల కోసం యుద్ధాలు పక్కన పెట్టారు.. ఇక మనమెంత?
- ●Raashii Khanna | పదమూడేళ్ల కల నిజమైన వేళ - రాశీఖన్నాకు ఊహించని ఛాన్స్!
- ●Morocco Vs Haiti | 52 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌లో గోల్స్.. మొరాకోకు చుక్కలు చూపించిన హైతీ, కానీ నాకౌట్‌కు ఎవరంటే?
- ●Banganapalle Mango | సింగపూర్‌కు సముద్ర మార్గంలో తొలి బంగినపల్లి మామిడి ఎగుమతి

London Climate Action Week 2026 | గ్రీన్ ఇండియా చాలెంజ్ రికార్డ్స్, సంతోష్ కుమార్ విజన్‌పై అంతర్జాతీయ నేతల ప్రశంసలు

Ritika Nayak | రెడ్ శారీలో మెరిసిన మిరాయ్ హీరోయిన్

Tungabhadra Dam Gates | మైసూరు రాజులు సైతం రైతుల కోసం యుద్ధాలు పక్కన పెట్టారు.. ఇక మనమెంత?

Raashii Khanna | పదమూడేళ్ల కల నిజమైన వేళ - రాశీఖన్నాకు ఊహించని ఛాన్స్!




