త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Teenmar Mallanna | అస‌లు ఈ ప్ర‌భుత్వానికి ఆర్టీసీ విలీనంపై ఇంట్రెస్ట్ ఉందా?: తీన్మార్ మ‌ల్ల‌న్న‌

Teenmar Mallanna | ఆర్టీసీని (TGS RTC) ప్ర‌భుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తార‌ని ఎమ్మ‌ల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న (Teenmar Mallanna) ప్ర‌శ్నించారు. అస‌లు ప్ర‌భుత్వానికి ఆర్టీసీ విలీనంపై (RTC Merger) ఆస‌క్తి ఉందా? అని నిల‌దీశారు.

G

Telangana | Published On Sep 7, 2026, 12.25 pm IST

Teenmar Mallanna | అస‌లు ఈ ప్ర‌భుత్వానికి ఆర్టీసీ విలీనంపై ఇంట్రెస్ట్ ఉందా?: తీన్మార్ మ‌ల్ల‌న్న‌
Advertisement

Teenmar Mallanna | త్రినేత్ర‌.న్యూస్‌: ఆర్టీసీని (TGS RTC) ప్ర‌భుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తార‌ని ఎమ్మ‌ల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న (Teenmar Mallanna) ప్ర‌శ్నించారు. అస‌లు ప్ర‌భుత్వానికి ఆర్టీసీ విలీనంపై (RTC Merger) ఆస‌క్తి ఉందా? అని నిల‌దీశారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేద‌న్నారు. శాస‌న మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆర్టీసీపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) స‌మాధానం ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గ‌త ప్ర‌భుత‌్వం 2023 సెప్టెంబ‌ర్ 29న అధికారుల కమిటీ ఏర్పాటు చేసింద‌ని, అది కార్యాచరణలోకి రాలేద‌న్నారు. మంత్రి వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన సమాధానం పూర్తిగా నిర్లక్ష్యపూరితంగా ఉంద‌న్నారు.

2018, 2023లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ (Congress Party) హామీ ఇచ్చింద‌ని గుర్తుచేశారు. స్వయంగా ముఖ్యమంత్రే కార్మిక సంఘాలతో ఆర్టీసీ విలీనం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అసలు ఈ ప్రభుత్వానికి ఆర్టీసీని విలీనం చేసే ఉద్దేశం ఉందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన గ్రాటిట్యూట్ రాక, భత్యాలు సరైన సమయానికి రాక ఇప్పటికే దాదాపు 400 మంది కార్మికులు చనిపోయార‌ని తెలిపారు. కార్మిక సంఘాలు విలీనం కోరుకున్నాయ‌ని, ఎన్నికలు (RTC Elections) కాదని చెప్పారు. ఎన్నిక‌లు పెడుతున్నారంటే సంస్థ‌ను విలీనం చేసే ఉద్దేశం లేద‌ని అర్ధ‌మ‌వుతున్న‌ద‌ని వెల్ల‌డించారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ తేదీని, విధివిధానాల‌ను ప్ర‌క‌టించాల‌ని ప్రభుత్వం డిమాండ్ చేశారు. రిటైర్ అయిన ఉద్యోగుల పెండింగ్ బ‌కాయిల‌ను వెంట‌నే చెల్లించాల‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement