త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gadwal Vijayalakshmi | స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి బాధ్యతల స్వీక‌ర‌ణ‌

Gadwal Vijayalakshmi | స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్‌గా మాజీ మేయ‌ర్‌ గద్వాల్ విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

D

Telangana | Published On Sep 7, 2026, 12.17 pm IST

Gadwal Vijayalakshmi | స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి బాధ్యతల స్వీక‌ర‌ణ‌
Advertisement

Gadwal Vijayalakshmi | స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్ (State Planning Board Vice Chairperson)గా మాజీ మేయ‌ర్‌ గద్వాల్ విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ప్ర‌జాభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆమె ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇవాళ ఉద‌యం ప్ర‌జా భ‌వ‌న్‌కు చేరుకున్న ఆమెకు వేద పండితులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి వేద పండితుల మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి ఫైల్‌పై సంత‌కం చేశారు. అనంతరం సీఎం ప్రజావాణి హాల్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కే కేశవరావు, వి. హనుమంతరావు, డాక్టర్ రోహిన్ రెడ్డి, ప్లానింగ్ శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ కే. విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

వ‌న‌ప‌ర్తి మాజీ ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో.. ఆయ‌న స్థానంలో గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మిని ప్ర‌భుత్వం నియ‌మించిన విష‌యం తెలిసిందే. గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మికి కేబినెట్ హోదా క‌ల్పించింది. అంత‌కుముందు విజ‌య‌ల‌క్ష్మి రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా కొన‌సాగారు. అయితే, విజ‌య‌ల‌క్ష్మిని ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షురాలిగా నియ‌మించ‌డంతో.. మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా నేరెళ్ల శార‌ద‌కు ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది.

Also Read..

బనియ‌న్స్‌పై అసెంబ్లీలోకి వెళ్తామ‌న్నారు.. మేం మ‌హిళ‌ల ప‌ట్ల అగౌర‌వంగా ప్ర‌వ‌ర్తించ‌లే: డీసీపీ శిల్ప‌వ‌ల్లి

అసెంబ్లీ వద్ద సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు.. VIDEO

కేసీఆర్ పాదయాత్ర చేస్తా అంటే జనాలు నవ్వుతున్నారు: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Advertisement

తాజావార్తలు

Advertisement