Congress Dharna | అసెంబ్లీకి రారు.. ప్రతిపక్ష పాత్రపోషించరు..
Congress Dharna | ‘ప్రభుత్వ ఉద్యోగి 365 రోజులు రాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తరు. మాజీ ముఖ్యమంత్రి 1000 రోజుల పాలనలో ఒక్కసారి అసెంబ్లీకి రారు. ప్రతిపక్ష పాత్ర పోషించరు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ప్రభుత్వం ఇంకా ఏమైనా చేయనివి ఉంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అనుభవంతో గౌరవంగా చెప్పాల్సి ఉండేదన్నారు.
- 1000 రోజుల పాలనలో ఒక్కసారి అసెంబ్లీకి రారు
- మంత్రి పొన్నం ప్రభాకర్
- కేసీఆర్ రాజీనామా చేయాలంటూ ఇందిరా పార్క్‌లో కాంగ్రెస్ ధర్నా
Congress Dharna | ‘ప్రభుత్వ ఉద్యోగి 365 రోజులు రాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తరు. మాజీ ముఖ్యమంత్రి 1000 రోజుల పాలనలో ఒక్కసారి అసెంబ్లీకి రారు. ప్రతిపక్ష పాత్ర పోషించరు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ప్రభుత్వం ఇంకా ఏమైనా చేయనివి ఉంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అనుభవంతో గౌరవంగా చెప్పాల్సి ఉండేదన్నారు. అసెంబ్లీకి హాజరుకాని మాజీ ముఖ్యమంత్రి, గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆదివారం ధర్నా చేపట్టింది. ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1000 రోజుల ప్రజాపాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ‘1000 రోజుల్లో చేసిన కార్యక్రమాలు చెప్తూనే గత ప్రభుత్వంలో అమలు చేసిన కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా అమలు చేస్తున్నాం..’ అని అన్నారు.
48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని మంత్రి తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. రేషన్ కార్డులు పంపిణీ చేశామని, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్ల బోనస్ అమలు చేస్తున్నామని తెలిపారు. 72 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు. ‘గ్రామాల్లో మన పథకాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి.. ధైర్యంగా చెప్పండి’ అని పార్టీ శ్రేణులకు సూచించారు. గురుకులాల్లో డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు.
బీజేపీ తెలంగాణకు ఏం తెచ్చిందో చెప్పాలి..
తెలంగాణ ఏర్పాటు ను అవమానించిన బిజెపి.. తెలంగాణ కు ఏం తెచ్చారు చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సహచర మంత్రులు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ‘మన కార్యకర్తలు మన పథకాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ramchandar Rao | రెండేళ్ల తర్వాత ఇంకా మీరుంటరా ఏంది.. అప్పుడు మేమొస్తం
- ●Harish Rao | ప్రతిపక్షాలను తిట్టడంపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర బిడ్డల గోసపై లేదా?
- ●Jagadish Reddy | కాంగ్రెస్ నేతల లాగుతడుస్తంది
- ●Sridhar Babu | కేసీఆర్ తీరు మారకుంటే.. బీఆర్ఎస్ మరో పదేండ్లు రోడ్లపైనే: మంత్రి శ్రీధర్ బాబు
- ●MP Liquor Tragedy | కల్తీ మద్యం తాగి 12 మంది మృతి, 'బాంబే విస్కీ' బ్రాండ్‌పై అనుమానాలు!
- ●Deviprasad | మూడేండ్లలో ఒక్క హామీ అమలు చేయలే.. మరో రెండేండ్లు అడగడం అమానుషం: దేవీప్రసాద్

Ramchandar Rao | రెండేళ్ల తర్వాత ఇంకా మీరుంటరా ఏంది.. అప్పుడు మేమొస్తం

Harish Rao | ప్రతిపక్షాలను తిట్టడంపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర బిడ్డల గోసపై లేదా?

Jagadish Reddy | కాంగ్రెస్ నేతల లాగుతడుస్తంది

Sridhar Babu | కేసీఆర్ తీరు మారకుంటే.. బీఆర్ఎస్ మరో పదేండ్లు రోడ్లపైనే: మంత్రి శ్రీధర్ బాబు



