త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | కేసీఆర్ పాదయాత్ర చేస్తా అంటే జనాలు నవ్వుతున్నారు: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Uttam Kumar Reddy | త్వ‌ర‌లో పాద‌యాత్ర చేస్తానంటూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ (KCR) ప్ర‌క‌టించ‌డాన్ని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) విమర్శలు చేశారు. కేసీఆర్ పాద‌యాత్ర చేస్తానంటే ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నార‌ని చెప్పారు.

G

Telangana | Published On Sep 7, 2026, 11.42 am IST

Uttam Kumar Reddy | కేసీఆర్ పాదయాత్ర చేస్తా అంటే జనాలు నవ్వుతున్నారు: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
Advertisement

Uttam Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: త్వ‌ర‌లో పాద‌యాత్ర చేస్తానంటూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ (KCR) ప్ర‌క‌టించ‌డాన్ని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) విమర్శలు చేశారు. కేసీఆర్ పాద‌యాత్ర చేస్తానంటే ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నార‌ని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram) కూలిపోయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా పాదయాత్ర చేస్తానని ఎలా చెబుతారని ప్రశ్నించారు. కాళేశ్వ‌రం విష‌యంలో ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తానే ఇంజినీర్‌ను అని కాళేశ్వ‌రం క‌ట్టి కూల్చేశార‌ని మండిప‌డ్డారు. ఇరిగేషన్‌ విషయంలో ఆయ‌న‌ చేసిన తప్పిదాల వల్లే రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌దని ఆరోపించారు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. కేసీఆర్ బీజేపీకి (BJP) స‌రెండ‌ర్ అయ్యార‌ని ఆరోపించారు. బీజేపీకి బీఆర్‌ఎస్‌ లొంగిపోయినప్పుడు ఇక చర్యలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తిచేయొద్ద‌ని ఎవ‌రు అడ్డుకున్నార‌ని ప్ర‌శ్నించారు.

ప్రాజెక్టుల్లో నీళ్లు లేక‌పోవ‌డానికి రెండు కారణాలు ఉన్నాయాని.. ఒక‌టి కేసీఆర్ అయితే.. మ‌రొక‌టి ఎల్‌నినో అని వ్యాఖ్యానించారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ పనితీరు సున్నా అని విమ‌ర్శించారు. నీళ్ల పంప‌కాల విష‌యంలో రాష్ట్రానికి అన్యాయం చేశార‌న్నారు. అన్నీ త‌న‌కే తెలిసిన‌ట్లు కేసీఆర్ మాట్లాడుతార‌ని, అయితే ప‌నితీరు మాత్రం సున్నా అని విమ‌ర్శించారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్లే నేడు నీళ్లు లేవ‌ని చెప్పారు. ఎండాకాలం తాగునీటి అవ‌స‌రాల దృష్ట్యా నీటిని చాలా పొదుపుగా వాడుతున్నామ‌ని తెలిపారు. ఇరిగేష‌న్ విష‌యంలో కేసీఆర్ ఫాం హౌస్‌లోనే ఉంటేనే మంచిద‌న్నారు. నీళ్లు ఉండికూడా తాము ఇవ్వ‌డం లేదా అని ప్ర‌శ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు లక్ష కోట్లు ఖర్చు చేశారని, ప్రాజెక్టును సరిగ్గా నిర్మించి ఉంటే ప్రస్తుత సమస్యలు వచ్చేవి కాద‌ని చెప్పారు. తుమ్మిడిహెట్టి నుంచి నీటిని తరలించే విషయంలో మార్పులు చేయడం ఘోర తప్పిదమన్నారు. ఆ మార్పులు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఉత్తర తెలంగాణ స‌స్యశ్యామలం అయ్యేదని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి ఎవరు అడ్డుపడ్డారని ప్ర‌శ్నించారు. అసెంబ్లీలో కేసీఆర్‌ బూతులు మాట్లాడినప్పుడు హీరోలాగా ఫీల్‌ అయ్యారని, అదే భాషను ఆయనపై ఉపయోగిస్తే మాత్రం నానా యాగీ చేస్తున్నారని విమ‌ర్శించారు. ఆయ‌న వాడిన భాష తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వ‌రూ వాడ‌లేద‌ని విమ‌ర్శించారు. తెలంగాణ భాష ఇలా అవ్వ‌డానికి కేసీఆర్ కార‌ణ‌మ‌ని చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement