త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | శాస‌న‌స‌భ‌ను గాంధీ భ‌వ‌న్‌లా మార్చేశారు : మాజీమంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌

Talasani Srinivas Yadav | ప‌విత్ర‌మైన అధికారం ఉంద‌ని శాస‌న‌స‌భ‌ను గాంధీ భ‌వ‌న్‌లా మార్చేశార‌ని మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ పాల‌క కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆదివారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ప్రజాస్వామ్యంలో ఈరోజు అసెంబ్లీ జరిగిన తీరు చీకటి రోజుగా భావిస్తున్నామ‌న్నారు.

P

Telangana | Published On Mar 29, 2026, 4.27 pm IST

Talasani Srinivas Yadav | శాస‌న‌స‌భ‌ను గాంధీ భ‌వ‌న్‌లా మార్చేశారు : మాజీమంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌
Advertisement

Talasani Srinivas Yadav | ప‌విత్ర‌మైన అధికారం ఉంద‌ని శాస‌న‌స‌భ‌ను గాంధీ భ‌వ‌న్‌లా మార్చేశార‌ని మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ పాల‌క కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆదివారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ప్రజాస్వామ్యంలో ఈరోజు అసెంబ్లీ జరిగిన తీరు చీకటి రోజుగా భావిస్తున్నామ‌న్నారు. ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని త‌మ పార్టీ ఉప నాయకుడు హరీశ్‌రావు స్పష్టంగా ఆధారాలతో సహ అసెంబ్లీలో వివ‌రించార‌ని తెలిపారు. దీనిపై హౌస్ క‌మిటీ వేయాల‌ని తాము డిమాండ్ చేశామ‌ని, ఇల్లీగల్ మైనింగ్‌పై ఆ శాఖ మంత్రికే తెలియదని విమ‌ర్శించారు. తాము హౌస్ క‌మిటీకి డిమాండ్ చేస్తే.. సీబీ సీఐడీతో విచార‌ణ చేయిస్తామ‌ని సీఎం అన్నార‌న్నారు.

స్పీకర్‌ని దళితుడ‌ని తాము ఎన్న‌డూ భావించ‌లేద‌న్నారు. త‌మ డిమాండ్ పై నిరసన తెలియజేస్తుంటే.. అటెన్షన్ డైవర్ట్‌లో భాగంగా కులాలకు అంటగట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశాడ‌ర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నా వెంట్రుక పీక లేరని కడియం శ్రీహరి వ్యవహార శైలి ఉంద‌ని, సభ ఆర్డర్ లేనప్పుడు అనేక అంశాలు జ‌రుగుతుంటాయ‌న్నారు. ఎథిక్స్ కమిటీ లేనే లేద‌ని.. పాడి కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తామని అంటున్నార‌ని ఆరోపించారు. భ‌ట్టి విక్రమార్క అంటే బీఆర్ఎస్ కు గౌరవం ఉంద‌ని, ఆనాడు భ‌ట్టి విక్రమార్క పాదయాత్ర చేశాడని సీఎం గుర్తు చేశాడు.. ఆయ‌న‌ను ముఖ్యమంత్రి చేయొచ్చు కదా? అని ప్ర‌శ్నించారు. సభలో అధికార పార్టీ సభ్యుల చేత బీఆర్ఎస్‌ని తిట్టించార‌న్నారు.

వెనుకబడిన తరగతుల పద్దుల విషయంలో చర్చపై వాస్తవాలు బయటకు వస్తాయ‌ని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నార‌న్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి వేల కోట్లు పెడుతున్నామని చెప్పి వంద రూపాయలు ఖర్చు చెయ్యలేద‌ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని పండబెట్టి తొక్కుతామని అన్నాడ‌ని, ఆ వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీకి రిఫర్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. ఒక మంత్రి ఏమో హౌస్ కమిటీకి అంగీకారం చెప్తాడ‌ని, ముఖ్యమంత్రి ఏమో సీబీ సీఐడీతో విచార‌ణ చేయిస్తా అంటున్నాడ‌ని మండిప‌డ్డారు.

ముఖ్యమంత్రి , మంత్రులకు మధ్య సఖ్యత లేదని మండిప‌డ్డారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ఒకానొక సందర్భంలో రాజకీయ పరమైన హక్కు హౌస్ కమిటీకి డిమాండ్ చేశార‌ని, సభను తప్పుదారి పట్టించి మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశార‌న్నారు. ద్రవ్య వినియోగ బిల్లుపై బీఆర్ఎస్ అభ్యంతరం చెప్తుందని మమ్మల్ని సస్పెండ్ చేశారంటూ త‌ల‌సాని ఆరోపించారు. సభలో తాము ఏది మాట్లాడాలో త‌మ హ‌క్కు ఉంటుంద‌ని, సస్పెండ్ చేయడం దుర్మార్గమైన చర్య అంటూ ధ్వ‌జ‌మెత్తారు. అక్ర‌మ మైనింగ్‌పై హౌస్ క‌మిటీ వేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి విచారణ చేస్తాం అంటున్నార‌ని.. చేసుకోవ‌చ్చ‌న్నారు. అమ్మనాన్న సంరక్షణ చట్టం తెస్తామని అంటున్నార‌ని, దానిపై ప్రభుత్వానికి స్పష్టత లేద‌న్నారు. దళితుల కోసం అనేక కార్యక్రమాలు కేసీఆర్ చేశార‌ని గుర్తు చేశారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నార‌ని త‌ల‌సాని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement