త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Green India Challenge | ఊరి ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు..

Green India Challenge | మాజీ రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్( Santosh Kumar ) చేప‌ట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌( Green India Challenge )లో భాగంగా చేప‌ట్టిన ఊరి ఊరికో జ‌మ్మి చెట్టు.. గుడి గుడికో జ‌మ్మి చెట్టు( Jammi Chettu ) కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది.

S

Telangana | Published On Oct 11, 2026, 1.37 pm IST

Green India Challenge | ఊరి ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు..
Advertisement

Green India Challenge | త్రినేత్ర న్యూస్ : మాజీ రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్( Santosh Kumar ) చేప‌ట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌( Green India Challenge )లో భాగంగా చేప‌ట్టిన ఊరి ఊరికో జ‌మ్మి చెట్టు.. గుడి గుడికో జ‌మ్మి చెట్టు( Jammi Chettu ) కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఆదివారం రాజ‌న్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌ప‌ల్లి మండ‌లం త‌డ‌గొండ గ్రామంలోని సాయిబాబా టెంపుల్‌లో ఆల‌య చైర్మ‌న్ ఉంకంటి క‌నుక రెడ్డి, స‌ర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్, మాజీ స‌ర్పంచ్ చిందం ర‌మేశ్ క‌లిసి జ‌మ్మి మొక్క నాటారు. జ‌మ్మి మొక్క నాట‌డానికి ముందు సాయిరాం శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారం స్ఫూర్తితో, జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నారని తెలిపారు. మన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే జమ్మి చెట్టును ప్రతి గ్రామంలో, ప్రతి ఆలయంలో నాటాలనే సంకల్పంతో “ఊరి ఊరికో జమ్మి చెట్టు – గుడి గుడికో జమ్మి చెట్టు” కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. భావితరాలకు పచ్చని ప్రకృతిని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బుర్ర రాజు, కట్ట జగదీష్ వర్ధన్, ఆలయ కమిటీ చైర్మన్ ఉకంటి కనుకరెడ్డి, గోగురి తిరుపతి రెడ్డి, మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు సింగారి రమేష్, చేపూరి మహిపాల్, మూదం కమలాకర్, వేముల సత్యం, పొన్నం తిరుపతి, కట్ట లింగయ్య, కొండ శంకరయ్య, వేముల అశోక్, బూరుగుపల్లి నరేష్, పిట్టల మల్లేశం, ఏడాపెల్లి మహేష్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement