త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jaggareddy | ఛ‌త్ర‌ప‌తి శివాజీని రాజకీయ ల‌బ్ధి కోస‌మే బీజేపీ వాడుకుంటుంది : జ‌గ్గారెడ్డి

Jaggareddy | చరిత్రని వక్రీకరించి ఛత్రపతి శివాజీ( Chhatrapati Shivaji Maharaj )ని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వాడుకుంటుందంటూ టీ పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి( Jaggareddy ) నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Oct 11, 2026, 4.33 pm IST

Jaggareddy | ఛ‌త్ర‌ప‌తి శివాజీని రాజకీయ ల‌బ్ధి కోస‌మే బీజేపీ వాడుకుంటుంది : జ‌గ్గారెడ్డి
Advertisement

Jaggareddy | త్రినేత్ర న్యూస్ : చరిత్రని వక్రీకరించి ఛత్రపతి శివాజీ( Chhatrapati Shivaji Maharaj )ని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వాడుకుంటుందంటూ టీ పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి( Jaggareddy ) నిప్పులు చెరిగారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా( Sangareddy District ) కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఛ‌త్ర‌ప‌తి శివాజీ విగ్ర‌హా ఏర్పాటుకు జ‌గ్గారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.

శివాజీ పాలనలో హిందువులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారని, దౌలత్ ఖాన్, ముల్లా హైదర్ వంటి ముస్లిం అధికారులు ఉన్నత స్థాయిలో పనిచేశారని ఆయన తెలిపారు. కులమతాలకు అతీతంగా తన రాజ్యంలోని ప్రజల బాగోగుల కోసం శివాజీ కృషి చేశారని అన్నారు. గొప్ప వీరుడైన శివాజీ ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధతతో పాలన సాగించారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఒక రాజుగా ముస్లిం పాలకులతో యుద్ధాలు చేశారే తప్ప, ముస్లిం ప్రజలపై దాడులు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాలకు మతపరమైన అర్థాలు ఆపాదించడం సరికాదని అన్నారు. యువత శివాజీ మహారాజ్ చరిత్రను అధ్యయనం చేసి, ఆయన వీరత్వం, పాలనా దక్షత, ప్రజల పట్ల నిబద్ధతను తెలుసుకోవాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మహనీయుల చరిత్రను వక్రీకరించడం తగదని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement