Gold Rings | ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టిన శిశువులకు బంగారం ఉంగరాలు
Gold Rings | ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టే అర్హత కలిగిన శిశువులకు ఒక గ్రాము, 22 క్యారెట్ల బంగారు ఉంగరం అందించే ‘తైమామన్ తంగ మోతిరం’ పథకాన్ని తమిళనాడు సీఎం సీ జోసెఫ్ విజయ్ సోమవారం మదురైలో ప్రారంభించనున్నారు. ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రి ఆడిటోరియంలో 25 మంది శిశువులకు స్వయంగా ఉంగరాలు అందజేయనున్నారు.
- అందించనున్న సీఎం విజయ్
- రేపు మధురైలో పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
Gold Rings | ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టే అర్హత కలిగిన శిశువులకు ఒక గ్రాము, 22 క్యారెట్ల బంగారు ఉంగరం అందించే ‘తైమామన్ తంగ మోతిరం’ పథకాన్ని తమిళనాడు సీఎం సీ జోసెఫ్ విజయ్ సోమవారం మదురైలో ప్రారంభించనున్నారు. ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రి ఆడిటోరియంలో 25 మంది శిశువులకు స్వయంగా ఉంగరాలు అందజేయనున్నారు. అనంతరం ప్రసూతి వార్డుకు వెళ్లి ఆ రోజు జన్మించిన శిశువులకు ఉంగరాలు ఇవ్వనున్నారు. తమిళనాడులో శాశ్వత నివాసం ఉండే తల్లులకు పుట్టిన శిశువులు ఈ పథకానికి అర్హులు. గర్భిణీ, శిశు వివరాల పర్యవేక్షణ వ్యవస్థ (PICME)లో నమోదు, ఆర్‌సీహెచ్ ఐడీ తప్పనిసరి. అర్హత ఉన్న శిశువులకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి సమయంలో ఉంగరం అందిస్తారు. ప్రతి ఉంగరానికి ప్రత్యేక సీరియల్ నంబర్ ఉండటంతోపాటు ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్‌లో అందజేయనున్నారు.
పథకానికి రూ.755.83 కోట్ల వార్షిక కేటాయింపు
ఈ పథకానికి ప్రభుత్వం ఏటా రూ.755.83 కోట్లు కేటాయించింది. తొలి దశలో 1.28 లక్షల బంగారు ఉంగరాలను తయారు చేయించింది ప్రభుత్వం. 2026 జూన్ 22 , ఈ తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో జన్మించిన అర్హత కలిగిన శిశువులకు ఈ పథకం వర్తిస్తుంది. జోయాలుక్కాస్, కళ్యాణ్ జ్యువెలర్స్‌కు ఉంగరాల తయారీ, సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. పథకం అమలులో పారదర్శకత, ఉంగరాల నిల్వ, పంపిణీని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. తమిళనాడులో ఏటా సుమారు 7.80 లక్షల మంది శిశువులు జన్మిస్తుండగా.. 99.9 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇందులో సుమారు 4.20 లక్షలు (53 శాతం) ప్రభుత్వాస్పత్రుల్లో జరుగుతున్నాయి. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడం, ఆస్పత్రుల్లో సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించడం ఈ పథకం ఉద్దేశమని పేర్కొంది.
ఆలస్యంగా ప్రారంభం
మాజీ సీఎం సీఎన్ అన్నాదురై జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15న పథకాన్ని ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. అయితే, సీఎం విజయ్ లండన్ పర్యటన నేపథ్యంలో వాయిదా పడింది. మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రెండు నియోజకవర్గాలను పథకం పరిధి నుంచి మినహాయించారు. మదురై పర్యటనలో సీఎం విజయ్ రూ.10.25 కోట్లతో పునరుద్ధరించిన గాంధీ మెమోరియల్ మ్యూజియాన్ని ప్రారంభించి, అక్కడి ఏర్పాట్లను పరిశీలించనున్నారు. అనంతరం మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రి, మ్యూజియం కార్యక్రమాలే అధికారిక షెడ్యూల్‌లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆలయ సందర్శనపై తుది నిర్ణయం సీఎంస్థాయిలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Vattikuti Ramarao Goud | ఎమ్మెల్సీ టికెట్ నాకే ఇవ్వండి.. మంత్రి ఉత్తమ్‌కు వట్టికూటి విజ్ఞప్తి
- ●LPU Students Protest | పంజాబ్ ఎల్పీయూలో హైటెన్షన్: మిగ్-23 ఎక్కి విద్యార్థుల నిరసన.. అసలు ఏం జరిగింది?
- ●Vakiti Srihari | ఆసియా క్రీడల్లో తరుణ్ పతకం తేవడం గర్వకారణం: మంత్రి వాకిటి
- ●Asian Games | ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లకు చుక్కెదురు..
- ●Cockroach Janta Party | అస్సాంలో తీవ్ర ఉద్రిక్తత: మీటింగ్‌కు ముందే సీజేపీ నేతల అరెస్ట్.. సీఎం హిమంతపై తీవ్ర ఆరోపణలు
- ●Ramayana | డివైన్ లుక్‌లో సాయిపల్లవి - రామాయణ పోస్టర్ రిలీజ్ - విమర్శలకు చెక్ పెట్టిన నాచురల్ బ్యూటీ

Vattikuti Ramarao Goud | ఎమ్మెల్సీ టికెట్ నాకే ఇవ్వండి.. మంత్రి ఉత్తమ్‌కు వట్టికూటి విజ్ఞప్తి

LPU Students Protest | పంజాబ్ ఎల్పీయూలో హైటెన్షన్: మిగ్-23 ఎక్కి విద్యార్థుల నిరసన.. అసలు ఏం జరిగింది?

Vakiti Srihari | ఆసియా క్రీడల్లో తరుణ్ పతకం తేవడం గర్వకారణం: మంత్రి వాకిటి

Asian Games | ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లకు చుక్కెదురు..





