త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nizamabad | భ‌ర్త శ‌రీరంలోకి టాయిలెట్ క్లీన‌ర్ ఎక్కించి.. ప్రాణాలు తీసిన భార్య‌

Nizamabad | త‌న వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్న భ‌ర్త‌ను వ‌దిలించుకునేందుకు భార్య పెద్ద ప్లానే చేసింది. మొద‌టగా త‌న భ‌ర్త‌కు పీక‌ల మ‌ద్యం తాగించి.. బిల్డింగ్ నుంచి కింద‌కు తోసేలా ప్లాన్ చేసింది.

S

Telangana | Published On Jul 7, 2026, 3.55 pm IST

Nizamabad | భ‌ర్త శ‌రీరంలోకి టాయిలెట్ క్లీన‌ర్ ఎక్కించి.. ప్రాణాలు తీసిన భార్య‌
Advertisement

Nizamabad | త్రినేత్ర‌.న్యూస్ : త‌న వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్న భ‌ర్త‌ను వ‌దిలించుకునేందుకు భార్య పెద్ద ప్లానే చేసింది. మొద‌టగా త‌న భ‌ర్త‌కు పీక‌ల మ‌ద్యం తాగించి.. బిల్డింగ్ నుంచి కింద‌కు తోసేలా ప్లాన్ చేసింది. కానీ స‌ఫ‌లం కాలేదు.. తీరా అత‌ను ఆస్ప‌త్రి పాల‌య్యాడు. ఇక ఇంట్లోనే భ‌ర్త‌కు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ.. దానికి బ‌దులుగా టాయిలెట్ క్లీన‌ర్, మ‌త్తు మాత్ర‌లు ఎక్కించి ప్రాణాలు తీసింది భార్య‌. ఈ దారుణ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన దాయిని ప్ర‌శాంత్(35), సంధ్య‌కు కొన్నేండ్ల క్రితం పెళ్లైంది. ఇక జీవ‌నోపాధి నిమిత్తం భ‌ర్త ప్ర‌శాంత్ గ‌ల్ఫ్‌కు వెళ్లాడు. ఈ క్ర‌మంలో సంధ్య‌కు స్థానికంగా ఉన్న అనిల్‌(35)తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. ఇరువురు త‌రుచుగా క‌లుసుకునేవారు.

అంత‌మొందించ‌డం ఎలా అనే దానిపైనే సంధ్య అన్వేష‌ణ

సీన్ క‌ట్ చేస్తే.. భ‌ర్త ప్ర‌శాంత్ జూన్ 27న గ‌ల్ఫ్ నుంచి నిజామాబాద్‌కు తిరిగొచ్చాడు. సంధ్య కుట్ర‌లో భాగంగా 29న రాత్రి అనిల్, ప్ర‌శాంత్ క‌లిసి పీక‌ల దాకా మ‌ద్యం సేవించారు. అనంత‌రం ప్ర‌శాంత్‌ను టెర్ర‌స్ పై నుంచి కింద‌కు తోసేశారు. చ‌నిపోతాడ‌నుకున్నారు.. కానీ తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. దీంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, చికిత్స అనంత‌రం డిశ్చార్జి చేశారు. త‌మ ప్ర‌య‌త్నం విక‌టించ‌డంతో.. అంత‌మొందించ‌డం ఎలా అనే దానిపైనే సంధ్య అన్వేష‌ణ కొన‌సాగింది.

టాయిలెట్ క్లీన‌ర్‌ నేరుగా భ‌ర్త ర‌క్త నాళాల్లోకి

ఇక రెండోసారి సంధ్య స‌రికొత్త ఎత్తుగ‌డ వేసింది. వృత్తిరీత్యా న‌ర్సు అయిన ఆమె.. భ‌ర్త‌కు ఇంట్లో ఎక్కించే ఫ్లూయిడ్స్‌లో టాయిలెట్ క్లీన‌ర్‌తో పాటు నిద్ర మాత్ర‌ల‌ను క‌లిపింది. ఇక ఆ ద్రావ‌ణాన్ని నేరుగా భ‌ర్త ర‌క్త నాళాల్లోకి ఎక్కించ‌డంతో ఊపిరి వ‌దిలాడు. భ‌వ‌నంపై నుంచి కింద‌ప‌డ్డ గాయాల‌తోనే భ‌ర్త మృతి చెందాడ‌ని బుకాయించే ప్ర‌య‌త్నం చేసింది.

త‌ల్లికి సంధ్య ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల అనుమానం

కానీ ప్ర‌శాంత్ త‌ల్లికి సంధ్య ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల అనుమానం క‌లిగింది. దీంతో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సంధ్య‌తో పాటు అనిల్‌ను విచారించ‌గా తామే చంపామ‌ని అంగీక‌రించారు. సంధ్య‌, అనిల్‌కు స‌హ‌కరించిన సాయి అనే యువ‌కుడిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

Advertisement
Advertisement