T PCC Chief | కార్తీక దీపం అంటూ కేటీఆర్ రాగాలు : టీ పీసీసీ చీఫ్
T PCC Chief | త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ దీపం ఆగిపోకుండా ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాగాలు తీస్తున్నారని టీ పీసీపీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.
T PCC Chief | త్రినేత్ర.న్యూస్ : త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ దీపం ఆగిపోకుండా ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాగాలు తీస్తున్నారని టీ పీసీపీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యాంగం ప్రకారమే విచారణ జరుపుతున్నాం. వ్యక్తిగత హననం చేస్తున్నారని కేటీఆర్ అనడం హాస్యాస్పదం. రాజకీయ కక్ష్య సాధింపు ధోరణి ఉంటే అధికారంలోకి రాగానే చర్యలు ఉండేవి. ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లే. కేటీఆర్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. బట్ట కాల్చి మీద వేసి పారిపోతామంటే కుదరదు. అలీ బాబా 420 దొంగల మాదిరి కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడింది అని టీ పీసీసీ చీఫ్ ధ్వజమెత్తారు.
దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తులపై మాత్రమే ట్యాపింగ్ ప్రయోగిస్తారు. నక్సలైట్లతో లావాదేవీలు జరుపుతున్నారని నాపై నిఘా పెట్టి ట్యాపింగ్ చేశారు. సినీ తారల ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది.? తోడ బుట్టిన చెల్లెలు కవిత ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతుంటే సమాధానం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రమైంది. ఉద్యమ కేసులతో పోల్చడం సరికాదు. అధికారులకు పరిమితులు ఉంటాయని మహేశ్ కుమార్ తెలిపారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



