త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Phone Tapping Case in Telangana | ఫోన్ ట్యాపింగ్ కేసు.. తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీం సీరియస్

విచారణ ఇంకా పూర్తి కాలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించడంతో ప్రభాకర్‌రావును మళ్లీ జైలులో పెట్టాలనుకుంటున్నారా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.

J

Telangana | Published On Jan 16, 2026, 5.28 pm IST

Phone Tapping Case in Telangana | ఫోన్ ట్యాపింగ్ కేసు.. తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీం సీరియస్
Advertisement

Phone Tapping Case in Telangana | తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ఇంటరాగేషన్ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రెండు వారాలకు కస్టడీకి అనుమతించాం. అయినా ఎందుకు విచారణ చేయలేదంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇంకెంతకాలం విచారణ చేస్తారు. కేసులో ఇంకా ఏం మిగిలి ఉంది. రెండు వారాల కస్టడీలో మీ పర్పస్ పూర్తికాలేదా? కేసు దర్యాప్తు దృష్టిలో ఉంచుకొని ఆర్టికల్ 142 కింద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ప్రభాకర్‌రావును మళ్లీ జైలులో పెట్టాలనుకుంటున్నారా?

తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈ కేసుపై సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర తన వాదనలు వినిపించారు. విచారణ ఇంకా పూర్తి కాలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించడంతో ప్రభాకర్‌రావును మళ్లీ జైలులో పెట్టాలనుకుంటున్నారా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన.. ఆయన్ను పిలవకుండా ఎందుకు ఉన్నారు. మళ్లీ పిలిచి విచారణ చేయవచ్చు కదా. దర్యాప్తునకు ఆయన సహకరిస్తారు.. అని చెప్పిన కోర్టు తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసి తదుపరి విచారణ వరకు మధ్యంతర రక్షణను పొడిగించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement