త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cancer Screening | ముందస్తు పరీక్షలతో క్యాన్సర్‌కు చెక్‌.. 250 మందికి పైగా మహిళలకు స్క్రీనింగ్‌!

Cancer Screening | మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పేద, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన 250 మందికి పైగా మహిళలకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు.

P

Hyderabad | Published On Nov 25, 2026, 10.40 pm IST

Cancer Screening | ముందస్తు పరీక్షలతో క్యాన్సర్‌కు చెక్‌.. 250 మందికి పైగా మహిళలకు స్క్రీనింగ్‌!
Advertisement

Cancer Screening | మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పేద, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన 250 మందికి పైగా మహిళలకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. రిసాలగడ్డ సమీపంలోని పాటిగడ్డలో బుధవారం డిసీజ్‌ ఎరాడికేషన్‌ త్రూ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (డీప్‌) ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. డీప్‌ ట్రస్ట్‌కు చెందిన ఉచిత మొబైల్‌ హెల్త్‌ స్క్రీనింగ్‌ బస్సు ద్వారా పరీక్షలు నిర్వహించారు. గైనకాలజిస్ట్‌, నలుగురు నర్సులు, మామోగ్రఫీ టెక్నీషియన్‌, పాప్‌ స్మియర్‌ టెక్నీషియన్‌తో కూడిన వైద్య బృందం సేవలందించింది. మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ గుర్తింపు కోసం మామోగ్రఫీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నిర్ధారణకు పాప్‌ స్మియర్‌ పరీక్షలు నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య పరీక్షలకు దూరంగా ఉంటున్న మహిళలకు ఈ శిబిరం ద్వారా ఉచితంగా సేవలు అందించారు.

ఈ ఏడాది ఇప్పటివరకు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 25కు పైగా ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరాలను నిర్వహించినట్లు డీప్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక ట్రస్టీ రాకేశ్‌ కలపాల తెలిపారు. వీటి ద్వారా నిరుపేద వర్గాలకు చెందిన 2,500 మందికి పైగా మహిళలకు పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ శిబిరాల్లో అందించిన వైద్య పరీక్షలు, రోగ నిర్ధారణ సేవల విలువ సుమారు రూ.10 కోట్లుగా ఉంటుందని వివరించారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సకు అవకాశం ఉంటుందని, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ముందస్తు పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ట్రస్ట్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీప్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్‌ మధు వాసేపల్లి, సీఈఓ స్వాతి మొహంతి, సీనియర్‌ వైద్యులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement