త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CMC | ట్రేడ్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌కు నవంబర్‌ 30 డెడ్‌లైన్‌

CMC | ట్రేడ్‌ లైసెన్స్‌ల రెన్యూవల్‌కు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) గడువు ప్రకటించింది. 2027 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు వర్తించే లైసెన్స్‌లను నవంబర్‌ 30, 2026లోగా రెన్యూవల్‌ చేసుకోవాలని కమిషనర్ జీ సృజన బుధవారం సూచించారు.

P

Hyderabad | Published On Nov 25, 2026, 10.15 pm IST

CMC | ట్రేడ్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌కు నవంబర్‌ 30 డెడ్‌లైన్‌
Advertisement

CMC | ట్రేడ్‌ లైసెన్స్‌ల రెన్యూవల్‌కు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) గడువు ప్రకటించింది. 2027 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు వర్తించే లైసెన్స్‌లను నవంబర్‌ 30, 2026లోగా రెన్యూవల్‌ చేసుకోవాలని కమిషనర్ జీ సృజన బుధవారం సూచించారు. గడువు దాటిన వారికి జరిమానాలు తప్పవని స్పష్టం చేశారు. డిసెంబర్‌ 1, 2026 నుంచి 2027 జనవరి 31 వరకు రెన్యూవల్‌ చేసుకుంటే 25 శాతం పెనాల్టీ విధించనున్నారు. ఫిబ్రవరి 1, 2027 నుంచి రెన్యూవల్‌ చేసుకునే వారికి 50 శాతం జరిమానా వర్తించనుంది. ఇప్పటికే లైసెన్స్‌ల రెన్యూవల్‌కు సంబంధించిన డిమాండ్లను సీఎంసీ రూపొందిస్తోంది. వ్యాపారులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం పంపించనుంది. వ్యాపార సంస్థలు, ట్రేడ్‌ లైసెన్స్‌దారులు నిర్ణీత గడువులోగా రెన్యూవల్‌ చేసుకుని నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.

Advertisement
Advertisement