త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramachander Rao | తెలంగాణ‌లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి : రామ‌చంద‌ర్ రావు

Ramachander Rao | తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి అని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు కోరారు. పారదర్శకతతో కూడిన, అవినీతి రహితమైన, ప్రజల సంక్షేమాన్ని ముందుంచే పరిపాలనను తప్పకుండా అందిస్తామని హామీ ఇస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On May 23, 2026, 6.30 pm IST

Ramachander Rao | తెలంగాణ‌లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి : రామ‌చంద‌ర్ రావు
Advertisement

Ramachander Rao | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి అని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు కోరారు. పారదర్శకతతో కూడిన, అవినీతి రహితమైన, ప్రజల సంక్షేమాన్ని ముందుంచే పరిపాలనను తప్పకుండా అందిస్తామని హామీ ఇస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.

విద్యావంతులు, మేధావులు, యువత, మహిళలు.. ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేసే విధానాన్ని, గత పన్నెండు సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అందిస్తున్న అవినీతిరహిత, సుపరిపాలనను చూస్తున్నారు. దేశం కోసం నిరంతరం శ్రమించే నాయకుడిగానే కాకుండా, అవినీతి రహిత పరిపాలనకు ప్రతీకగా నరేంద్ర మోదీ నిలిచారు. అదే స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు దేశంలో అందిస్తున్న సుపరిపాలనను ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఈరోజు దేశ ప్రజలు, ముఖ్యంగా యువత, భారతీయ జనతా పార్టీ వైపు ఆశతో చూస్తున్నారని రామ‌చంద‌ర్ రావు తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాయో ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు, అవినీతి, రాజకీయ అహంకారంతో వ్యవహరించిన బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోందనే భావన ప్రజల్లో బలపడుతోంది. కొత్త కొత్త ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల డీపీఆర్‌లు తయారు చేస్తూ, ప్రజల సంక్షేమం కన్నా తమ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని మరింత అప్పుల బారిన పడేస్తూ, ప్రజలపై భారం మోపే పరిస్థితి తీసుకొస్తున్నారంటూ ఆయ‌న మండిప‌డ్డారు.

రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మక్క, జొన్నతో పాటు ఇతర పంటలను కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆ హామీలను నిలబెట్టుకోలేక రైతులను మోసం చేస్తున్నారు. రైతులకు సరైన సమాచారం ఇవ్వకుండా, కొనుగోళ్లలో ఆలస్యం చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.. ఇప్పటికైనా రైతులను మోసం చేయడం మానుకొని, రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి, ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి అని డిమాండ్ చేశారు.

ప్రజలకు కూడా మేం విజ్ఞప్తి చేస్తున్నాం.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మోసపూరిత రాజకీయాలను ఇక నమ్మవద్దు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పన్నెండు సంవత్సరాలుగా దేశానికి అందిస్తున్న నిజాయితీ గల, అవినీతి రహిత పరిపాలనను ఆశీర్వదిద్దాం. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. పారదర్శకతతో కూడిన, అవినీతి రహితమైన, ప్రజల సంక్షేమాన్ని ముందుంచే పరిపాలనను తప్పకుండా అందిస్తామని మేము హామీ ఇస్తున్నాం అని రామ‌చంద‌ర్ రావు పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement