Trump Brilliant Tyrant Dictator | నన్ను ‘డిక్టేటర్’ అనండి, కానీ ‘డంబ్’ అంటే ఊరుకోను: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మెంటల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్!
నన్ను 'తెలివైన నియంత' అని పిలిచినా పర్వాలేదు కానీ, 'మూర్ఖుడు' అంటే మాత్రం ఊరుకోను అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
International | Published On May 23, 2026, 11.00 pm IST
- తనను మూర్ఖుడని విమర్శించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
- తనను తెలివైన నియంత (brilliant tyrant dictator) అని పిలిచినా ఇబ్బంది లేదన్న ట్రంప్
- విమర్శకులకు బదులిచ్చేందుకు తన మానసిక స్థితిని నిరూపించుకునే పరీక్ష (cognitive test) మూడుసార్లు పాస్ అయ్యానని వెల్లడి
- పదే పదే ఈ టెస్ట్ రాయడం ఆయన మానసిక స్థితి క్షీణతకు సంకేతమని కొందరు వైద్య నిపుణుల హెచ్చరిక
Trump Brilliant Tyrant Dictator | త్రినేత్ర.న్యూస్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనను ఎవరైనా 'మూర్ఖుడు' (Dumb) అని విమర్శిస్తే అస్సలు సహించలేనని, కావాలంటే 'తెలివైన నియంత' (Brilliant tyrant dictator) అని పిలుచుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కుండబద్దలు కొట్టారు.
"నేనే అత్యంత తెలివైనవాడిని"
79 ఏళ్ల వయసున్న ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. "మీరు చూసిన వారిలో నేనే అత్యంత తెలివైనవాడిని. దేశానికి ఒక స్మార్ట్ పర్సన్ (Smart person) అధ్యక్షుడిగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా?" అని ప్రశ్నించారు. వాస్తవానికి ఈ సభ ఆర్థికపరమైన అంశాలపై (Affordability) జరగాల్సి ఉన్నప్పటికీ, తన 'మెంటల్ ఫిట్‌నెస్' చుట్టూ జరుగుతున్న వివాదాలపై ట్రంప్ టాపిక్ డైవర్ట్ చేసి సుదీర్ఘంగా మాట్లాడారు.
డాక్టర్‌తో కాగ్నిటివ్ టెస్ట్ ముచ్చట్లు
తనను మూర్ఖుడని విమర్శించే వారికి చెక్ పెట్టేందుకు తాను డాక్టర్‌ను కలిసి ఏకంగా ఒక టెస్ట్ గురించి అడిగినట్లు ట్రంప్ వివరించారు. ఈ సంభాషణను గుర్తుచేసుకుంటూ..
"నేను నా డాక్టర్‌తో.. నన్ను తెలివైన నియంత అన్నా పర్వాలేదు, కానీ డంబ్ అనడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నన్ను నేను నిరూపించుకునేందుకు ఏదైనా టెస్ట్ ఉందా? అని అడిగాను. దానికి ఆయన 'కాగ్నిటివ్ టెస్ట్' (Cognitive test) ఒకటి ఉందని చెప్పారు. అది ఇంతకు ముందు ఏ అధ్యక్షుడైనా రాశారా అని అడిగితే.. ఎవరూ రాయలేదని బదులిచ్చారు." అని ట్రంప్ సభలో చెప్పుకొచ్చారు. ఈ పరీక్షలో ప్రశ్నలు ముందు ఈజీగా ఉండి, పోనుపోను చాలా కష్టంగా మారుతాయని ఆయన తెలిపారు.
"మూడుసార్లు ఆ టెస్ట్ పాస్ అయ్యా.."
గతంలో బరాక్ ఒబామా, జో బైడెన్ లాంటి డెమోక్రాట్ నాయకులపై విమర్శలు గుప్పించిన ట్రంప్.. ప్రెసిడెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నవారు కచ్చితంగా ఈ కాగ్నిటివ్ ఎగ్జామ్ రాయాలని డిమాండ్ చేశారు. తాను తన పదవీకాలంలో ఏకంగా మూడుసార్లు ఈ పరీక్ష రాశానని, మూడింట్లోనూ అద్భుతంగా పాస్ అయ్యానని (Aced it) ట్రూత్ సోషల్ (Truth Social) వేదికగా ఆయన గొప్పలు చెప్పుకున్నారు.
వైద్య నిపుణులు ఏమంటున్నారంటే?
ట్రంప్ పదే పదే ఈ 'మాంట్రియల్ కాగ్నిటివ్ అసెస్‌మెంట్' (ఇది డిమెన్షియా లేదా మతిమరుపును గుర్తించే పరీక్ష) రాశానని చెప్పడం పట్ల వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ వ్యవధిలో మూడుసార్లు ఈ టెస్ట్ రాయడం ఆయన మానసిక స్థితి క్షీణిస్తోందనడానికి (deteriorating) సంకేతమని మాజీ జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ గార్ట్‌నర్ వ్యాఖ్యానించారు. కొద్దిపాటి బుర్ర ఉన్న ఎవరికైనా ఆయన మెంటల్ హెల్త్ పడిపోతోందన్న విషయం ఇట్టే అర్థమవుతుందంటూ ఘాటుగా విమర్శించారు.
అయితే, పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్‌సెత్ మాత్రం ట్రంప్ అత్యంత చురుకైన (Sharpest), దూరదృష్టి గల (Insightful) కమాండర్-ఇన్-చీఫ్ అని ఆయనకు మద్దతుగా నిలిచారు.
President Trump:
"I don’t mind being called a brilliant, total tyrant dictator, but I don’t want to be called dumb."#Trump #PNC pic.twitter.com/qJHNAC1aLB
— People's news Channel (@peoplesnews2024) May 23, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

US Iran Ceasefire | అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్? మరో 60 రోజులు కాల్పుల విరమణ.. రంగంలోకి పాక్
మే 23, 2026

Marco Rubio India Visit | అమెరికా విదేశాంగ మంత్రితో ప్రధాని మోదీ భేటీ.. ఆసక్తికరంగా మారిన ‘వైట్ హౌస్’ ఆహ్వానం
మే 23, 2026

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026
తాజావార్తలు
- ●Delhi Gymkhana Club Eviction | ఎలైట్ ఎంపైర్‌కు ఎండ్ కార్డ్: ఢిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు.. జూన్ 5 డెడ్‌లైన్!
- ●US Iran Ceasefire | అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్? మరో 60 రోజులు కాల్పుల విరమణ.. రంగంలోకి పాక్
- ●Telangana Cabinet Decisions | ఇందిరమ్మ ఇండ్లు, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, పుష్కరాలకు నిధులు.. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాల పూర్తి వివరాలివే
- ●HCA | తొలిసారిగా టీజీ20 క్రికెట్ లీగ్.. హెచ్‌సీఏ నిర్ణయం
- ●Kiran Abbavaram | వదలనే అంటోన్న కిరణ్ అబ్బవరం - అచ్చ తెలుగు బ్యూటీతో లవ్ సాంగ్
- ●Mouni Roy | తల్లి వయసు 40 - కొడుక్కి 39 ఏళ్లు - మౌనీరాయ్ బాలీవుడ్ మూవీపై నెటిజన్ల ట్రోల్

Delhi Gymkhana Club Eviction | ఎలైట్ ఎంపైర్‌కు ఎండ్ కార్డ్: ఢిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు.. జూన్ 5 డెడ్‌లైన్!

US Iran Ceasefire | అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్? మరో 60 రోజులు కాల్పుల విరమణ.. రంగంలోకి పాక్

Telangana Cabinet Decisions | ఇందిరమ్మ ఇండ్లు, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, పుష్కరాలకు నిధులు.. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాల పూర్తి వివరాలివే

HCA | తొలిసారిగా టీజీ20 క్రికెట్ లీగ్.. హెచ్‌సీఏ నిర్ణయం



