త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | హరీశ్.. బీఆర్ఎస్‌లో మీ ఫ్యూచర్ ఏంటో మీకే తెలియదు.. మీరు ఫ్యూచర్ సిటీని ఆపుతారా ?: మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy | తాము అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని (Future City) ర‌ద్దు చేస్తామన్న బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావుపై (Harish Rao) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) మండిప‌డ్డారు.

G

Telangana | Published On May 23, 2026, 11.37 am IST

Ponguleti Srinivas Reddy | హరీశ్.. బీఆర్ఎస్‌లో మీ ఫ్యూచర్ ఏంటో మీకే తెలియదు.. మీరు ఫ్యూచర్ సిటీని ఆపుతారా ?: మంత్రి పొంగులేటి
Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: తాము అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని (Future City) ర‌ద్దు చేస్తామన్న బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావుపై (Harish Rao) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) మండిప‌డ్డారు. బీఆర్ఎస్‌లో మీ ఫ్యూచ‌ర్ ఏంటో మీకే తెలువ‌దు. అలాంటిది మీరు ఫ్యూచ‌ర్ సిటీని ఆపుతారా అంటూ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వ‌స్తామంటూ ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని విమ‌ర్శించారు. మీ పొలిటికల్ ఫ్యూచర్‌ను ఖతం చెయ్యాల‌ని కేసీఆర్‌, కేటీఆర్ చూస్తున్నారు. ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి మీ ఫ్యూచర్ కాపాడుకో అని హిత‌వుప‌లికారు.

అమెరికాలో ఉండి..

`అమెరికాలో ఉండి ఫ్యూచర్ సిటీని ఆపేస్తాం అంటూ ప్రకటించిన హరీష్ రావు గారు.. ఈ భూములను తాకట్టు పెట్టడానికి అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందం చేసుకున్నారా..?. పదేండ్లలో హైదరాబాద్ లో కనీసం ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టని మీకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఒక నగరమే నిర్మిస్తున్నది అంటే అసూయ కలగక తప్పదు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం ఎక్కడ పడితే అక్కడ ఫాంహౌస్ లు కట్టుకున్నారు. కానీ మేము రాష్ట్రం కోసం, దేశం కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే, ఆపుతాం అంటున్నారు.

మూసీని బాగుచేస్తామంటే అడ్డుపడుతున్నారు, లగచర్లలో ఇండస్ట్రీస్ పెట్టి యువతకు ఉద్యోగాలిస్తామంటే కుట్రచేసారు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఆపుతాం అంటున్నారు.

ఫ్యూచర్ కాపాడుకో..

అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్న హరీష్ రావు గారు, ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. దేశం గర్వించే విధంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుంది. మీ పొలిటికల్ ఫ్యూచర్ ఖతం చెయ్యాలి అని మీ మామా మీ బామ్మర్ది చూస్తున్నారు.. ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ నుండి పోయి మీ ఫ్యూచర్ కాపాడుకో. చివరగా ఒక్కటి మాత్రం చెప్పదల్చుకున్నా.. బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు.` అని ఎక్స్ వేదిక‌గా హ‌రీశ్ రావుపై మంత్రి పొంగులేటి నిప్పులు చెరిగారు.

Advertisement

తాజావార్తలు

Advertisement