BRS Leader | మూడు ముక్కలుగా నరికి.. 3 గోనెసంచుల్లో కట్టి.. సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య..
BRS Leader Murder | సూర్యాపేట (Suryapet) మండలం ఎర్కారంలో బీఆర్‌ఎస్ నేత దారుణ హత్యకు (BRS Leader Murder) గురయ్యారు. మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధును (Chinthalapati Madhu) దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు.
BRS Leader | త్రినేత్ర.న్యూస్: సూర్యాపేట (Suryapet) మండలం ఎర్కారంలో బీఆర్‌ఎస్ నేత దారుణ హత్యకు (BRS Leader) గురయ్యారు. మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధును (Chinthalapati Madhu) దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. మూడు ముక్కలుగా నరికి మూడు గోనెసంచుల్లో కట్టి గ్రామ సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గ్రామ రాజకీయాల్లో మధు కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆయన భార్య మౌనిక బీఆర్ఎస్ తరపున గ్రామ సంర్పంగా పనిచేశారు. అయితే గత కొన్ని రోజులుగా రాజకీయ ఆదిపత్య పోరు కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మధు హత్య చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తున్నది. 2020 ఫిబ్రవరిలో అప్పటి బీఆర్ఎస్ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న కూడా దారుణ హత్యకు గురయ్యారు. వరుస రాజకీయ హత్యలతో గ్రామంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, కొన్నేండ్ల క్రితం అప్పటి సర్పంచి మిద్దె రవీందర్ హత్య కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జిల్లా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.
తాజావార్తలు
- ●Why People Avoid Jewelry | మెడలో, చేతులకు ఎలాంటి ఆభరణాలు ధరించని వారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?
- ●TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!
- ●AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!
- ●Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!
- ●Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?
- ●KTR Delhi visit | ఢిల్లీలో కేటీఆర్.. తెలంగాణ బిడ్డ సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి

Why People Avoid Jewelry | మెడలో, చేతులకు ఎలాంటి ఆభరణాలు ధరించని వారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?

TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!

AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!

Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!






