త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sri Rama Navami | రామ‌య్య క‌ల్యాణానికి ముస్తాబైన భ‌ద్రాచ‌లం..

Sri Rama Navami | శ్రీసీతారాముల క‌ల్యాణానికి (Sri Rama Navami) భ‌ద్రాచ‌ల ఆల‌యం (Bhadrachalam) స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబ‌యింది. అభిజిత్ ల‌గ్న‌మున అమ్మ‌వారి మెడ‌లో రామ‌య్య తాళిక‌ట్ట‌నున్నారు.

G

Telangana | Published On Mar 27, 2026, 8.26 am IST

Sri Rama Navami | రామ‌య్య క‌ల్యాణానికి ముస్తాబైన భ‌ద్రాచ‌లం..
Advertisement

Sri Rama Navami | త్రినేత్ర‌.న్యూస్‌: శ్రీసీతారాముల క‌ల్యాణానికి (Sri Rama Navami) భ‌ద్రాచ‌ల ఆల‌యం (Bhadrachalam) స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబ‌యింది. అభిజిత్ ల‌గ్న‌మున అమ్మ‌వారి మెడ‌లో రామ‌య్య తాళిక‌ట్ట‌నున్నారు. లోక‌క‌ల్యాణం కోసం జ‌రిగే ఈ క‌ల్యాణఘ‌ట్టాన్ని క‌న్నులారా వీక్షించేందుకు భ‌ద్రాద్రికి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు. రాముల‌వారి కల్యాణానికి సీఎం రేవంత్‌రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.

సీతారాముల పరిణయానికి వేదికైన‌ మిథిలా మైదాన ప్రాంగణంలో ప్రత్యేకంగా కల్యాణ మండపాన్ని అలంకరించారు. ఉదయం 10.30 నుంచి 12.30 గంట‌ల‌ వరకు కల్యాణ ఘట్టం జరగనుంది. వేద మంత్రోచ్చరణాలు మారుమోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచే సమయాన్ని శుభ ముహూర్తంగా కీర్తిస్తారు. క‌ల్యాణోత్స‌వంలో భాగంగా గురువారం ఎదుర్కోలు ఉత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించారు.

కాగా, రాములవారి క‌ల్యాణం నేప‌థ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కల్యాణ వేడుక నిర్వహించే మిథిలా స్టేడియంలో భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. కల్యాణ మండపాన్ని పుష్పమాలలతో అందంగా అలంకరించారు. కల్యాణ మండప ప్రాంగణంలో ఎండ వేడి నుంచి భక్తులు సేద తీరేందుకు పొగ మంచు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 2వేల మందికి పైగా పోలీస్‌ సిబ్బంది బందోస్తులో ఉన్నారు. లడ్డుప్రసాదం, తలంబ్రాల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాట్లు చేశారు. ఉచిత తలంబ్రాల పంపిణీకి 9 ప్రదేశాల్లో 80 కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. భక్తులకు పంపిణీ చేసేందుకు 300 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేశారు. లడ్డుప్రసాదం పంపిణీకి 20 కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులకోసం తెలుగు రాష్ట్రాల నుంచి 406 బస్సులను నడుపుతున్నారు. కాగా, భద్రాద్రి రామాలయం అభివృద్ధికి రూ. 351 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement