Special Trains | తిరుమల-షిర్డీ మధ్య కొత్తగా వీక్లీ ట్రైన్.. పూర్తి షెడ్యూల్, టైంటేబుల్ ఇదే..!
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు తీపికబురు చెప్పింది. తిరుపతి వేంకటేశ్వరస్వామి, షిర్డీ సాయిబాబా ఆలయాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. తిరుపతి-షిర్డీ, చర్లపల్లి-తిరుపతి, చర్లపల్లి-నర్సాపూర్ సహా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది.
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు తీపికబురు చెప్పింది. తిరుపతి వేంకటేశ్వరస్వామి, షిర్డీ సాయిబాబా ఆలయాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. తిరుపతి-షిర్డీ, చర్లపల్లి-తిరుపతి, చర్లపల్లి-నర్సాపూర్ సహా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. తిరుపతి–సాయినగర్ షిర్డీ–తిరుపతి మధ్య నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17425-17426) మధ్య ప్రతి ఆదివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఇది డిసెంబర్ 14 నుంచి ప్రతి ఆదివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అయితే మొదటి ప్రయోగాత్మక రైలును డిసెంబర్ 9న నడిపించనున్నారు. ఆ రోజు ప్రత్యేక రైలు సంఖ్య 07425తో తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి బయలుదేరుతుంది. తరువాతి రోజు, అంటే డిసెంబర్ 10న 07426 రైలు షిర్డీ నుంచి తిరుపతికి ప్రారంభ సర్వీస్ నడుస్తుంది. ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు రైల్వే బోర్డు కూడా అధికారిక అనుమతి ఇచ్చింది. ప్రతి సోమవారం షిర్డీ నుంచి తిరుపతికి (17426) రైలు తిరిగి వస్తుంది. ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, నడికూడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, గంగాఖేర్, పర్భాని, సేలు, జల్నా, శంభాజీనగర్, నాగర్ సోల్, మన్మడ్, కోపర్ గావ్ వంటి స్టేషన్ల మీదుగా సాయినగర్ షిర్డీకి చేరుతుంది.
ఇక ప్రయాణికుల రద్దీ పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి టెర్మినల్ నుంచి రెండు ప్రత్యేక రైల్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 6వ తేదీ రాత్రి 9.35 గంటలకు చర్లపల్లి–తిరుపతి ప్రత్యేక రైలు, అలాగే 26వ తేదీ రాత్రి 10.40 గంటలకు చర్లపల్లి–నర్సాపూర్ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని అధికారులు వివరించారు. చర్లపల్లి–తిరుపతి రైలు మల్కాజిగిరి, కాచిగూడ, ఉమ్డానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి–నర్సాపూర్ రైలు నల్లగొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






