త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్ న్యూస్‌

Special Trains | సంక్రాంతి (Sankranti)కి ఊరెళ్లే ప్ర‌యాణీకుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) అధికారులు సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేష‌న్‌లో ర‌ద్దీని నియంత్రించేందుకు హైటెక్ సిటీ రైల్వే స్టేష‌న్‌ (Hi-Tech City Railway Station)లో తాత్కాలికి స్టాపేజీ (Temporary Stoppage) ఏర్పాటు చేశారు.

A

Andhra pradesh | Published On Dec 23, 2025, 4.13 pm IST

Special Trains | సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్ న్యూస్‌
Advertisement

Special Trains | త్రినేత్ర.న్యూస్‌: సంక్రాంతి (Sankranti)కి ఊరెళ్లే ప్ర‌యాణీకుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ప్ర‌యాణీకుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేష‌న్‌లో ర‌ద్దీని నియంత్రించేందుకు తాత్కాలిక స్టాపేజీ (Temporary Stoppage)ని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా వివిధ ప్రాంతాల మ‌ధ్య స‌ర్వీసులందించే 16 రైళ్ల‌కు హైటెక్ సిటీ రైల్వే స్టేష‌న్‌ (Hi-Tech City Railway Station)లో తాత్కాలికి స్టాపేజీ క‌ల్పించింది. దీంతో వ‌చ్చే నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు హైటెక్‌సిటీ ప‌రిసర ప్రాంతాల్లో నివ‌సించే ప్ర‌యాణీకులు ఈ రైళ్ల‌ను హైటెక్ సిటీ రైల్వే స్టేష‌న్‌లోనే ఎక్క‌వ‌చ్చు. ఈ మేర‌కు ఆయా రైళ్ల నెంబ‌ర్లు, రైలు ప్రారంభ‌మ‌య్యే స్టేష‌న్‌, గ‌మ్య‌స్థానం, హైటెక్ సిటీ రైల్వే స్టేష‌న్‌కు ఆ రైలు వ‌చ్చే స‌మ‌యం, బ‌య‌ల్దేరే స‌మ‌యం వివ‌రాల‌తో అధికారులు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement