త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్‌

Special Trains | సంక్రాంతి (Sankranti) పండుగ నేప‌థ్యంలో సొంతూళ్లకు వెళ్లేవారి కోసం మ‌రిన్ని ప్ర‌త్యేక రైళ్ల (Special Trains)ను వ‌చ్చే నెల 7వ తేదీ నుంచి న‌డుప‌నున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) ప్ర‌క‌టించింది.

A

Telangana | Published On Dec 28, 2025, 4.03 pm IST

Special Trains | సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్‌
Advertisement

Special Trains | సంక్రాంతి (Sankranti) పండుగ‌కు ఊరెళ్లే ప్ర‌యాణీకులకు రైల్వే (Railway) అధికారులు మరొక గుడ్ న్యూస్ చెప్పారు. ఊర్ల‌కు వెళ్లే వారి కోసం ప్ర‌త్యేక రైళ్లు (Special Trains) న‌డుపనున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) ప్ర‌క‌టించింది. పండ‌గ ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని వ‌చ్చే నెల 7వ తేదీ నుంచి ఈ రైళ్ల‌ను న‌డుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

సికింద్రాబాద్ (Secunderabad) నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వివిధ ప్రాంతాల‌కు ఈ రైళ్ల‌ను న‌డుప‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. పండుగ‌కు వెళ్లి తిరిగి వ‌చ్చే వారి కోసం సైతం ప్ర‌త్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయ‌ని వివ‌రించారు. ఈ ప్ర‌త్యేక రైళ్ల‌లో సెకండ్ క్లాస్‌ జ‌న‌ర‌ల్‌, స్లీప‌ర్‌, థ‌ర్డ్ ఏసీ, సెకెండ్ ఏసీ, ఫ‌స్ట్ ఏసీ కోచ్‌లు ఉంటాయ‌ని చెప్పారు. ఈ రైళ్ల‌కు ఈ నెల 29వ తేదీ ఉద‌యం ఎనిమిది గంట‌ల నుంచి ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్లు ప్రారంభ‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు.

స్పెష‌ల్ రైళ్లు... అవి న‌డిచే తేదీలు...

07460 కాకినాడ టౌన్ – వికారాబాద్ 08.01.2026
07461 వికారాబాద్ – పార్వ‌తీపురం 09.01.2026 & 11.01.2026
07462 పార్వ‌తీపురం – వికారాబాద్‌ 10.01.2026
07463 పార్వ‌తీపురం – కాకినాడ టౌన్ 12.01.2026
07464 సికింద్రాబాద్ – పార్వ‌తీపురం 08.01.2026
07465 పార్వ‌తీపురం – సికింద్రాబాద్ 09.01.2026
07186 కాకినాడ టౌన్ – వికారాబాద్ 07.01.2026 & 09.01.2026
07185 వికారాబాద్ – కాకినాడ టౌన్ 08.01.2026
07187 వికారాబాద్ – కాకినాడ టౌన్ 10.01.2026

Advertisement

తాజావార్తలు

Advertisement