Medaram | మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు
Medaram | మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ (Sammakka Sarallamma) జాతరకు తెలంగాణ ఆర్టీసీ (TGRTC) ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వివిధ ప్రాంతాల నుంచి మేడారంకు మొత్తం 3,495 ప్రత్యేక బస్సులు (Special Buses)ను యాభై శాతం అదనపు చార్జీలతో నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.
Medaram | త్రినేత్ర.న్యూస్ : ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ (Sammakka Sarallamma) జాతరకు తెలంగాణ ఆర్టీసీ (TGRTC) ప్రత్యేక బస్సులను (Special Buses) నడుపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వివిధ ప్రాంతాల నుంచి మేడారంకు మొత్తం 3,495 బస్సులు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి ప్రత్యేక బస్సులని, అందుకే ఆ బస్సుల్లో యాభై శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమైనదని, సౌకర్యవంతమైనదని చెప్పారు.
మేడారం జాతర ఈ నెల 28వ తేదీన ప్రారంభమై 31వ తేదీ వరకు జరుగుతుంది. తొలిరోజు సాయంత్రం ఆరుగంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిగిద్దరాజు గద్దెలపై కొలువుదీరడంతో జాతర ప్రారంభమవుతుంది. 29న సాయంత్రం ఆరు గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి తీసుకువస్తారు. ఇది మొత్తం జాతరలోనే కీలక ఘట్టం. 30న భక్తులు తమ మొక్కులను చెల్లిస్తారు. 31న సాయంత్రం ఆరు గంటలకు దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.
ఈ జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించిన ప్రభుత్వం జాతర ఏర్పాట్లకు రూ.వంద కోట్లకు పైగా నిధులు ఖర్చుపెట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






