Gollala Gudi | జాతీయ స్మారకాలుగా గొల్లాల గుడి.. శివాలయం!
Gollala Gudi | త్రినేత్ర.న్యూస్: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి పడమర దిక్కున ఉన్న ఉపాలయాలైన గొల్లాల గుడి (త్రికూటాలయం-Gollala Gudi), శివాలయాలకు (Shiva Temple) జాతీయ స్థాయి గుర్తింపు (National Monument Status) లభించనుంది.
Gollala Gudi | త్రినేత్ర.న్యూస్: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి పడమర దిక్కున ఉన్న ఉపాలయాలైన గొల్లాల గుడి (త్రికూటాలయం-Gollala Gudi), శివాలయాలకు (Shiva Temple) జాతీయ స్థాయి గుర్తింపు (National Monument Status) లభించనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సాంస్కృతిక పురావస్తుశాఖ తెలిపింది. వీటిని తమ అధీనంలోకి తీసుకోనున్నామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే రెండు నెలల్లోగా తెలపాలని సూచించింది. అభ్యంతరాలను dg.asi@gov.in మెయిల్ ద్వారా తెలియజేయవచ్చని పేర్కొంది.
యునెస్కో (Unesco) గుర్తింపు సమయంలో ప్రతినిధి వాసుపోశ్యనందన రామప్ప ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ రెండు ఆలయాలను పరిశీలించారు. వాటిని పురావస్తుశాఖ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని సూచించారు. దీంతో పురావస్తు శాఖ నాటి కలెక్టర్‌ను సంప్రదించి.. ఆలయాలను తీసుకోవాలంటే సుమారు 9 ఎకరాల భూమి అవసరమని తెలిపింది. దీంతో రెండేండ్ల క్రితమే రెవెన్యూ అధికారులు అవసరమైన భూమిని అందించారు.

గ్రామసభ నిర్వహించి అభ్యంతరం లేదంటూ చేసిన తీర్మానం కేంద్రానికి అందించడంతో గొల్లాల గుడి, శివాలయంపై రాష్ట్రపతి అప్రూవల్ జారీ చేశారు. దీంతో కేంద్ర పురావస్తు శాఖ అధికారులు గెజిట్ విడుదల చేస్తూ.. ఈ ఆలయాల స్మారక చిహ్నాలపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని కోరింది. పాలంపేటలోని స్మారక చిహ్నాల గుర్తింపు ప్రకటన భవిష్యత్ తరాల కోసం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది.

రామప్ప ఆలయంతోపాటే..
క్రీ.శ. 1213లో రామప్ప ఆలయాన్ని (Ramappa Temple) నిర్మించిన సమయంలోనే గొల్లాల గుడిని కూడా కట్టారు. ఈ ఆలయంలో దక్షిణం, పడమర, ఉత్తర దిశల్లో మూడు లింగాలు ఉంటాయి. వివిధ ప్రాంతాల నుంచి గొర్రెలు, పశువులు మేపుకోవడానికి వచ్చిన గొల్లలు భోజనం వండుకోవడానికి, వర్షాల సమయంలో గుడిలోనే ఆశ్రయం పొందేవారని, అందుకే దీనికి గొల్లాల గుడి అని పేరువచ్చిందని చెబుతారు. మరో ఉపాలయం శివాలయాన్ని కూడా రామప్ప సమయంలోనే నిర్మించారు. ఇక్కడ తూర్పుముఖంలో లింగం ఉండటం విశేషం.
ఇవికూడా చదవండి..
మార్చి 8 రాశిఫలాలు.. ఈ రాశివారికి పూర్వీకుల సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది!
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి






