MLA Kadiyam Srihari | ఎమ్మెల్యే కడియం అనర్హత పిటిషన్.. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ
MLA Kadiyam Srihari | జనగామ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్‌పై విచారణ ముగిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అడ్వకేట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
MLA Kadiyam Srihari | త్రినేత్ర.న్యూస్ : జనగామ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్‌పై విచారణ ముగిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అడ్వకేట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి పార్టీ మారినట్లు ఉన్న ఆధారాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అందజేశారు. అయితే ఎమ్మెల్యే శ్రీహరి అనర్హత పిటిషన్‌పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
జాతిపిత అనుకుంటే సరిపోతుందా..? కేసీఆర్‌పై కడియం ఫైర్
జనగామ నియోజకవర్గంలో కడియం శ్రీహరి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఆయనెవరో జాతిపిత అని పేరు పెట్టుకుంటున్నారని.. అందుకు ఆయనకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. వారికి వారే జాతిపిత అనుకుంటే సరిపోతుందా.. ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా అని అన్నారు.
‘జాతిపిత ఎక్కడ చదువుకున్నారు.. జాతిపిత ఎక్కడుంటున్నారు.. జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి కదా. జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. వేల కోట్ల అక్రమాలకు పాల్పడి, కూలిపోయే కాళేశ్వరం కట్టి.. మీరు చేసిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకుంటే తెలంగాణను అవమానపరిచినట్టా..? తెలంగాణ మీ అయ్యా సొత్తా..? తెలంగాణ అమరుల త్యాగాలతో సకల జనుల పోరాటంతో ఆవిర్భవించింది. తెలంగాణ నీ అయ్యా జాగీరు కాదు. మీ అహంకారం, అహంభావం వల్లే ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటారు. ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానుకోవాలి’ అని కడియం శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



