Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులు
Phone Tapping Case | బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Phone Tapping Case | బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు 160 సీఆర్పీసీ కింద సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్ విచారించిన సంగతి తెలిసిందే.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఈ నెల 23వ తేదీన సిట్ అధికారులు విచారించారు. దాదాపు ఏడు గంటల పాటు కేటీఆర్‌ను ప్రశ్నించారు సిట్ అధికారులు. అంతకుముందు జనవరి 20న హరీశ్‌రావును కూడా ఏడు గంటల పాటు విచారించారు. మళ్లీ మూడు రోజుల విరామం అనంతరం తాజాగా పార్టీ జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ నెలలో కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌లో 9 మంది అధికారులు ఉన్నారు.
సిట్‌కు ఉన్న నాలెడ్జ్ ఇదేనా..?
ఈ నోటీసుల జారీ నేపథ్యంలో సిట్‌కు ఉన్న నాలెడ్జ్ ఏంటో తేలిపోయిందని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నారు. సంతోష్ కుమార్‌కు జారీ చేసిన నోటీసులు తప్పులతడకగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం సంతోష్ కుమార్ కేవలం పార్టీ జనరల్ సెక్రటరీగా మాత్రమే కొనసాగుతున్నారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం ఎప్పుడో ముగిసింది. ఆ మాత్రం అవగాహన లేని సిట్ అధికారులు.. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నట్టు సిట్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఆయన పేరును కూడా తప్పుగా పేర్కొన్నారు. ఆయన అసలు పేరు జోగినపల్లి సంతోష్ కుమార్ కాగా, నోటీసుల్లో మాత్రం జోగినిపల్లి సంతోష్ రావు అని పేర్కొనడం సిట్ అధికారులకు ఉన్న అవగాహన రాహిత్యం బయటపడిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఆ నోటీసుల్లో ఉన్న అడ్రస్ కూడా సరికాదని, ఏ మాత్రం అవగాహన లేకుండా.. నోటీసులు జారీ చేస్తున్నారని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



