Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు
Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (SIT) దూకుడు కనపరుస్తోంది. తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలతో పాటు ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సోదరుడు కొండల్‌రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. గురువారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (SIT) దూకుడు కనపరుస్తోంది. తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సోదరుడికి నోటీసులు జారీ చేసింది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సీఎం రేవంత్ సోదరుడు కొండల్‌రెడ్డిలను గురువారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ (Sajjanar) ను సిట్ చీఫ్‌గా నియమిస్తూ, మరికొంత మంది అధికారులను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. అనంతరం కేసు విచారణలో వేగం పెరిగింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు (Prabhakar Rao) ను సుప్రీం కోర్టు తీర్పు మేరకు రెండు వారాల పాటు సిట్ కస్టోడియల్ విచారణ నిర్వహించింది. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్‌రావును సుదీర్ఘంగా ప్రశ్నించింది. తాజాగా ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండల్‌రావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనయుడు సందీప్‌రావులకు బుధవారం విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.
మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)ను విచారించాలనుకున్న సిట్‌కు చుక్కెదురైంది. ఆయనపై దాఖలైన కేసును తెలంగాణ హైకోర్టు గతంలో కొట్టేయగా, సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించడంతో హరీశ్‌రావుకు ఊరట లభించినట్లైంది. ప్రభాకర్‌రావు విచారణ అనంతరం దీనికి సంబంధించిన నివేదికను ఈ నెలాఖరులోపే కోర్టుకు సమర్పించాల్సిన నేపథ్యంలో సిట్ విచారణ వేగవంతం చేయడం ఆసక్తికరంగా మారింది.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Harish Rao | తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా: హరీశ్ రావు
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



