Sircilla | అనుమానంతో భార్యను చంపిన భర్త.. అడ్డొచ్చిన అత్తను కూడా..
Sircilla | సిరిసిల్ల జిల్లా (Sircilla) ఎల్లారెడ్డిపేట మండలంలో దారుణం చోటుచేసుకుంది. అనుమనంతో (Family Disputes) భార్యను చంపిన వ్యక్తి.. అడ్డుగా వచ్చిన అత్తను కూడా పొడిచాడు.
Sircilla | త్రినేత్ర.న్యూస్: సిరిసిల్ల జిల్లా (Sircilla) ఎల్లారెడ్డిపేట మండలంలో దారుణం చోటుచేసుకుంది. అనుమనంతో (Family Disputes) భార్యను చంపిన వ్యక్తి.. అడ్డుగా వచ్చిన అత్తను కూడా పొడిచాడు. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో దవాఖానలో చికిత్స పొందుతున్నది.
ఎల్లారెడ్డిపేట మండలం పదిర వడ్డెరకాలనీకి చెందిన గండికోట చంద్రయ్య–ఎల్లవ్వ దంపతుల కూతురు జ్యోతి(28)ని ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన పల్లపు సురేశ్‌కు ఇచ్చి పదేండ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నదని అనుమానం పెంచుకున్న అతడు.. గతకొంతకాలంగా జ్యోతితో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం జ్యోటిని చంపడానికి ప్రయత్నించాడు. ఒకరోజు నిద్రిస్తుండగా మెత్తతో చంపాలని చూడగా.. తప్పించుకున్న ఆమె తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో వారు వెళ్లి జ్యోతిని పుట్టింటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటున్నది. గ్రామానికి సమీపంలో ఉన్న అర్బన్‌పార్క్‌లో దినసరి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నది.
అయితే బుధవారం జ్యోతి తన తల్లి ఎల్లవ్వతో కలిసి కరీంనగర్ దవాఖానలో చూపించుకోవడానికి వెళ్లింది. చీకటి పడే సమయంలో బస్సు దిగి ఒడ్డెరకాలనీకి వెళ్తుండగా.. అప్పటికే అక్కడ మరో ముగ్గురితో కలిసి కాపు కాస్తున్న సురేశ్.. వారిని వెంబడించి కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన అత్తపై కూడా దాడి చేశాడు. జ్యోతి మృతి చెందినట్లు నిర్ధారించుకొని కత్తిని అక్కడే వదిలేసి అదే కారులో పరారయ్యాడు. అనంతరం సిరిసిల్ల పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది.
తాజావార్తలు
- ●Landmine | కర్రెగుట్టల్లో పేలిన మందుపాతర.. ఆవులు మేపేందుకు వెళ్లి వ్యక్తి మృతి
- ●ACB Raids | సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు
- ●SSC JE Recruitment | కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. 1748 పోస్టులతో SSC JE నోటిఫికేషన్
- ●Hindu Temple Demolition | పాక్‌లో మదర్సా కోసం వందేండ్లనాటి గుడి కూల్చివేత.. ఖండించిన భారత్
- ●పిలుపులేమో స్వదేశీ... దిగుమతులేమో విదేశీ: ఎన్నాళ్ళీ రూపాయి కుంగుబాటు?
- ●Horoscope | సెప్టెంబర్ 3 రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనవసరమైన ఆందోళనలు!

Landmine | కర్రెగుట్టల్లో పేలిన మందుపాతర.. ఆవులు మేపేందుకు వెళ్లి వ్యక్తి మృతి

ACB Raids | సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు

SSC JE Recruitment | కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. 1748 పోస్టులతో SSC JE నోటిఫికేషన్

Hindu Temple Demolition | పాక్‌లో మదర్సా కోసం వందేండ్లనాటి గుడి కూల్చివేత.. ఖండించిన భారత్





