Landmine | కర్రెగుట్టల్లో పేలిన మందుపాతర.. ఆవులు మేపేందుకు వెళ్లి వ్యక్తి మృతి
Landmine | ములుగు (Mulugu) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కర్రెగుట్టల అడవుల్లో (Karreguttalu Forest) మావోయిస్టులు అమర్చినట్లు భావిస్తున్న మందుపాతర (Landmine) పేలింది. దీంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
Landmine | త్రినేత్ర.న్యూస్: ములుగు (Mulugu) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కర్రెగుట్టల అడవుల్లో (Karreguttalu Forest) మావోయిస్టులు అమర్చినట్లు భావిస్తున్న మందుపాతర (Landmine) పేలింది. దీంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మావోయిస్టులు ఉనికిలేనప్పుడు మందుపాతర పేలడు కలకలం సృష్టించింది. ఇప్పటికే కర్రెగుట్టలను మావోయిస్టు రహిత ప్రాంతంగా పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.
బుధవారం సాయంత్రం వెంకటాపురం మండలం నూగురు గ్రామానికి చెందిన మడకం నాగేశ్వరరావు (55) ఆవులు మేపేందుకు కర్రెగుట్ట అడవి ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ అడవిలో అమర్చిన మందుపాతరపై అడుగుపెట్టడంతో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పేలుడుకు సంబంధించిన సమాచారం అందుకున్న గ్రామస్తులు కాలినడకన అడవిలోకి వెళ్లి నాగేశ్వరరావు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. గతంలో ఈ ప్రాంతం మావోయిస్టులకు (Maoists) కేంద్రంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఎలక్ట్రిక్ వైర్లు, మందుపాతరలు కనిపిస్తే.. వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
తాజావార్తలు
- ●RTC Bus Accident | జుక్కల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా పడి డ్రైవర్ మృతి
- ●SIAM Sales Report | కార్లలో మహారాష్ట్ర.. బైక్‌లలో యూపీ.. SIAM రిపోర్ట్..
- ●POCO X8 Power 5G | 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
- ●Sonia Gandhi | హార్పర్ కొలిన్స్ చేతికి సోనియా గాంధీ ఆత్మకథ
- ●Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార - డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్
- ●Kavitha | నేనూ సీఎం అవుతా: కల్వకుంట్ల కవిత

RTC Bus Accident | జుక్కల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా పడి డ్రైవర్ మృతి

SIAM Sales Report | కార్లలో మహారాష్ట్ర.. బైక్‌లలో యూపీ.. SIAM రిపోర్ట్..

POCO X8 Power 5G | 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..

Sonia Gandhi | హార్పర్ కొలిన్స్ చేతికి సోనియా గాంధీ ఆత్మకథ






