త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murder | ఇద్ద‌రు కుమార్తెల‌ను చంపి.. గొంతు కోసుకున్న తండ్రి..!

Murder | ఓ వ్య‌క్తి అత్యంత దారుణానికి ఒడిగ‌ట్టాడు. కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన ఇద్ద‌రు బిడ్డ‌ల‌ను త‌న చేతుల‌తోనే చంపేశాడు. ఆ త‌ర్వాత ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు.

S

National | Published On Aug 11, 2026, 7.46 am IST

Murder | ఇద్ద‌రు కుమార్తెల‌ను చంపి.. గొంతు కోసుకున్న తండ్రి..!
Advertisement

Murder | త్రినేత్ర‌.న్యూస్ : ఓ వ్య‌క్తి అత్యంత దారుణానికి ఒడిగ‌ట్టాడు. కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన ఇద్ద‌రు బిడ్డ‌ల‌ను త‌న చేతుల‌తోనే చంపేశాడు. ఆ త‌ర్వాత ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. నాగ‌వార‌కు చెందిన ఎస్‌జీ ఇమ్రాన్(40) అనే వ్య‌క్తి త‌న ఇద్ద‌రు కుమార్తెల‌తో బెంగ‌ళూరులోని ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో సోమ‌వారం ఉద‌యం దిగాడు. సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో 5, 10 ఏండ్ల వ‌య‌సున్న త‌న ఇద్ద‌రు బిడ్డ‌ల‌ను గొంతు నులిమి చంపేశాడు. వారిద్ద‌రూ చ‌నిపోయార‌ని నిర్ధారించుకున్న త‌ర్వాత‌.. హోట‌ల్ గ‌దిలోని టాయిలెట్‌లోకి వెళ్లాడు. అక్క‌డ క‌త్తితో గొంతు కోసుకున్నాడు. ఆ బాధ భ‌రించ‌లేక ఇమ్రాన్ గ‌ట్టిగా కేక‌లు వేశాడు.

అప్ర‌మ‌త్త‌మైన హోట‌ల్ సిబ్బంది.. ఆ గ‌ది త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టి చూడగా షాక్‌కు గుర‌య్యారు. ఇద్ద‌రు పిల్ల‌లు చ‌నిపోయి ఉన్నారు. ఇమ్రాన్ బాత్రూమ్‌లో ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్నాడు. పోలీసుల‌కు స‌మాచారం అందించ‌గా, వారు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రస్తుతానికి ఇమ్రాన్ చికిత్స పొందుతున్నాడు. ప్రాణాల‌కు ఎలాంటి ముప్పు లేద‌ని వైద్యులు తేల్చారు.

ఆమెతో నా పిల్ల‌లు పెర‌గొద్దు..

త‌న భార్య‌తో త‌న పిల్ల‌లు పెర‌గొద్ద‌ని చికిత్స పొందుతున్న ఇమ్రాన్ తెలిపిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. అందుకే పిల్ల‌ల‌ను చంపి, తాను ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాన‌ని ఇమ్రాన్ తెలిపాడు. అయితే ఇమ్రాన్ ఎందుకు ఇలా చేశాడ‌నే దానిపై అత‌ని కుటుంబ స‌భ్యుల‌ను కూడా విచారిస్తామ‌ని పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అయితే భార్య‌కు వివాహేత‌ర సంబంధం కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు

Advertisement
Advertisement