త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shabad Murders case | షాబాద్ రాజ్‌కుమార్ దొర‌క‌లే.. వ‌దంతులు అబ‌ద్దం: డీసీపీ యోగేష్ గౌతం

Shabad Murdered case | షాబాద్ ఆరు హ‌త్య‌ల కేసు నిందితుడు రాజ్‌కుమార్‌ దొరికాడ‌న్న వార్త‌ల్లో నిజం లేద‌ని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వ‌దంతుల‌పై ఆయ‌న ఆదివారం మాట్లాడారు.

S

Telangana | Published On Jul 12, 2026, 4.31 pm IST

Shabad Murders case | షాబాద్ రాజ్‌కుమార్ దొర‌క‌లే.. వ‌దంతులు అబ‌ద్దం: డీసీపీ యోగేష్ గౌతం
Advertisement

Shabad Murders case | త్రినేత్ర‌.న్యూస్‌: షాబాద్ ఆరు హ‌త్య‌ల కేసు నిందితుడు రాజ్‌కుమార్‌ దొరికాడ‌న్న వార్త‌ల్లో నిజం లేద‌ని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వ‌దంతుల‌పై ఆయ‌న ఆదివారం మాట్లాడారు. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. నిందితుడు కోసం మొత్తం తొమ్మిది బృందాలతో గాలిస్తున్నామని పేర్కొన్నారు. చేగూరు రైల్వే ట్రాక్ దాటి అడవి ప్రాంతంలోకి నిందితుడు వెళ్లినట్లు సమాచారం ఉంద‌న్నారు. రైల్వే పోలీస్, ట్రాకింగ్, హ్యూమన్ ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ బృందాలు గాలిస్తున్నాయని వెల్ల‌డించారు. రాజ్‌కుమార్ తన మొబైల్ ఫోన్‌ను శుక్రవారం రాత్రి 11:47 స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించామ‌ని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా తిమ్మాపూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో పోలీసులు అదుపులో తీసుకున్నట్లు ఓ ప్ర‌త్య‌క్ష సాక్షి తెలిపాడు. జామ‌కాయ తినుకుంటూ వ‌చ్చిన రాజ్‌కుమార్ టిఫిన్ ఎక్క‌డ దొరుకుతుంద‌ని అడిగిన‌ట్లు స‌ద‌రు వ్య‌క్తి చెప్పాడు. ఆ స‌మ‌యంలో ఓ కానిస్టేబుల్ వ‌చ్చి రాజ్‌కుమార్‌ను ప‌ట్టుకున్న‌ట్లు తెలిపాడు.

పోక్సో కేసులో నిందితుడైన దైవాలగూడకు చెందిన పార్వతి రాజ్‌కుమార్ న‌ర‌మేధానికి ఒడిగ‌ట్టాడు. వరుసబెట్టి ఆరుగుర్ని అతి కిరాతకంగా హత్య చేశాడు. తనపై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, నానమ్మను చంపేసి అనంత‌రం కట్టుకున్న భార్యను, అభం శుభం తెలియని ఇద్దరు కొడుకుల్నీ పొట్ట‌న‌బెట్టుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి జ‌రిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిప‌డ్డారు.

 

Advertisement
Advertisement