RTC Bus Accident | జుక్కల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా పడి డ్రైవర్ మృతి
RTC Bus Accident | కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తా సమీపంలోని 161వ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బిచ్కుంద వైపు వెళ్తున్న హైదరాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జుక్కల్ మండలంలోని కౌలాస్ చౌరస్తాకు సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.
- పలువురికి గాయాలు
- ప్రమాద సమయంలో బస్సులో 13 మంది ప్రయాణికులు
- బిచ్కుంద ఆస్పత్రికి బాధితుల తరలింపు
RTC Bus Accident | త్రినేత్ర.న్యూస్: కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తా సమీపంలోని 161వ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బిచ్కుంద వైపు వెళ్తున్న హైదరాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జుక్కల్ మండలంలోని కౌలాస్ చౌరస్తాకు సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడగా డ్రైవర్ డి.ఆంజనేయులు సీటు కింద ఇరుక్కుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కండక్టర్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి ముందు సుమారు 200 మీటర్ల దూరం నుంచే బస్సు అదుపుతప్పి వంకరగా వెళ్తుండటంతో ప్రయాణికులు భయంతో కేకలు వేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాన్సువాడ డీఎస్పీ పరిస్థితిని సమీక్షించారు. చాలాసేపు శ్రమించి డ్రైవర్ ఆంజనేయులు మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో బస్సు బోల్తా పడటంతో పాటు ముందు రెండు టైర్లు విడిపోయాయి. ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
బస్సు ప్రమాదం కలచివేసింది: మంత్రి పొన్నం ప్రభాకర్
జుక్కల్ సమీపంలో జరిగిన ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి తీవ్రంగా కలిచివేసింది. ఆర్టీసీ ఎండీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడాను. ప్రమాదానికి గల కారణాలను, ఘటనా స్థలంలోని ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నా. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాను. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన ప్రయాణికులను అంబులెన్స్‌లల్లో సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. ఆర్‌ఎం నేతృత్వంలో అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించాను. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●SIAM Sales Report | కార్లలో మహారాష్ట్ర.. బైక్‌లలో యూపీ.. SIAM రిపోర్ట్..
- ●POCO X8 Power 5G | 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
- ●Sonia Gandhi | హార్పర్ కొలిన్స్ చేతికి సోనియా గాంధీ ఆత్మకథ
- ●Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార - డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్
- ●Kavitha | నేనూ సీఎం అవుతా: కల్వకుంట్ల కవిత
- ●CJP | హిందుత్వ కార్యకర్తను అరెస్ట్ చేయాలి.. సీజేపీ ఆందోళన

SIAM Sales Report | కార్లలో మహారాష్ట్ర.. బైక్‌లలో యూపీ.. SIAM రిపోర్ట్..

POCO X8 Power 5G | 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..

Sonia Gandhi | హార్పర్ కొలిన్స్ చేతికి సోనియా గాంధీ ఆత్మకథ

Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార - డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్





