POCO X8 Power 5G | 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
POCO X8 Power 5G | పోకో సంస్థ భారత మార్కెట్లో పోకో ఎక్స్8 పవర్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, బలమైన నిర్మాణ నాణ్యత, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ మద్దతును కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.
Technology | Published On Sep 4, 2026, 3.04 pm IST
POCO X8 Power 5G | పోకో సంస్థ భారత మార్కెట్లో పోకో ఎక్స్8 పవర్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, బలమైన నిర్మాణ నాణ్యత, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ మద్దతును కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎక్కువసేపు ఫోన్‌ను ఉపయోగించే పవర్ యూజర్లు, మొబైల్‌లో వీడియోలు చూసే వారికి అనుగుణంగా ఇందులో హైఎండ్ ఫీచర్లను అందించింది. పోకో ఎక్స్8 పవర్ 5జికి ప్రధాన ఆకర్షణ భారీ 10,000 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ. ఇందులో 16 శాతం సిలికాన్ కంటెంట్‌ను ఉపయోగించారు. 100 వాట్ల హైపర్‌ఛార్జ్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సుమారు 20 నిమిషాల్లో ఒక రోజు సాధారణ వినియోగానికి సరిపడే ఛార్జింగ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. 27 వాట్ల వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
దీర్ఘకాలం బ్యాటరీ మన్నిక..
బ్యాటరీ దీర్ఘకాలిక పనితీరుకు టీయూవీ సూడ్ 5-స్టార్ బ్యాటరీ పనితీరు ధ్రువీకరణ లభించింది. 1,600 ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా కనీసం 80 శాతం బ్యాటరీ సామర్థ్యాన్ని నిలుపుకుంటుందని పేర్కొంది. సాధారణ రోజువారీ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది దాదాపు ఆరు సంవత్సరాల వినియోగానికి సమానమని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో 6.83 ఇంచుల 1.5కె అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది గరిష్ఠంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. వేగవంతమైన టచ్ స్పందన కోసం 3,200 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందించారు. వెట్ టచ్ టెక్నాలజీ 2.0 కారణంగా నీరు, నూనె, చెమట, ఫోమ్ వంటి పరిస్థితుల్లోనూ టచ్ ఇన్‌పుట్‌ను గుర్తించేలా డిస్‌ప్లేను రూపొందించారు. డిస్‌ప్లే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3,840 హెడ్జ్ హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, హెచ్‌డీఆర్10 ప్లస్‌తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్‌ను కలిగి ఉంది. స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ ఉంది.
వాటర్, డస్ట్ రెసిస్టెన్స్..
ఈ ఫోన్‌కు ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కె వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లను అందించారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఇచ్యారు. డైనమిక్ మెమరీ ఎక్స్‌పాన్షన్ ద్వారా గరిష్ఠంగా 16 జీబీ వరకు ర్యామ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత షియోమీ హైపర్‌ఓఎస్ 3తో ఫోన్ పనిచేస్తుంది. 4 సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను కంపెనీ అందించనుంది. అలాగే 6 సంవత్సరాల పాటు కొత్త ఫోన్‌లా సాఫ్ట్‌వేర్ పనితీరు ఉంటుందనే ధ్రువీకరణను కూడా అందించింది. ఈ ఫోన్‌లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 8 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. ట్రూ-టు-లైఫ్ పోర్ట్రెయిట్ ప్రాసెసింగ్, డ్యుయల్ వీడియో క్యాప్చర్‌తోపాటు ఏఐ గ్లేర్ రిమూవల్, ఏఐ ఎరేజ్ ప్రొ వంటి పోస్ట్-ప్రాసెసింగ్ ఫీచర్లు ఉన్నాయి. షియోమీ హైపర్‌ఏఐ, గూగుల్ సర్కిల్ టు సెర్చ్, గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్‌ను కూడా ఫోన్‌లో అందించారు. అలాగే ఆడియో కోసం స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్నాయి. ప్రత్యేకంగా 400 శాతం వాల్యూమ్ బూస్ట్ మోడ్‌ను కూడా అందించారు. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి కూడా ఉన్నాయి.
ధర వివరాలు..
పోకో ఎక్స్8 పవర్ 5జి ఫోన్ ఎల్లో, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.35,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.38,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంచారు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.2వేల కూపన్ డిస్కౌంట్, రూ.1వేయి బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తాయి. నో-కాస్ట్ ఈఎంఐ నెలకు రూ.2,750 నుంచి ప్రారంభమవుతుంది.
తాజావార్తలు
- ●Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార - డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్
- ●Kavitha | నేనూ సీఎం అవుతా: కల్వకుంట్ల కవిత
- ●CJP | హిందుత్వ కార్యకర్తను అరెస్ట్ చేయాలి.. సీజేపీ ఆందోళన
- ●Adobe | అడోబ్ కొత్త సీఈవోగా అనిల్ చక్రవర్తి.. ఐఐటీ నుంచి టెక్ దిగ్గజం వరకు..
- ●Fire breaks out at Hospital | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది నవజాత శిశువులు సహా..
- ●Air India Flight | మత్తులోనే ఎయిర్ ఇండియా పైలట్.. ఏఏఐబీ దర్యాప్తులో వెల్లడి!

Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార - డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్

Kavitha | నేనూ సీఎం అవుతా: కల్వకుంట్ల కవిత

CJP | హిందుత్వ కార్యకర్తను అరెస్ట్ చేయాలి.. సీజేపీ ఆందోళన

Adobe | అడోబ్ కొత్త సీఈవోగా అనిల్ చక్రవర్తి.. ఐఐటీ నుంచి టెక్ దిగ్గజం వరకు..



